రీతూ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్, సంజనా కి ముద్దు పెట్టిన సుమన్ శెట్టి.. బిగ్ బాస్ హౌస్ ను లవర్స్ పార్క్ చేసిన గౌతమ్.

Published : Nov 25, 2025, 11:16 PM IST

Bigg Boss Telugu 9 బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల యుద్ధం ముగిసిన తరువాత.. కెప్టెన్సీ టాస్క్ ల రచ్చ స్టార్ట్ అయ్యింది. అందుకోసం బిగ్ బాస్ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించి.. టాస్క్ ల మంట అంటించాడు. 

PREV
14
తుది దశకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో అప్పుడే 12వ వారానికి చేరుకుంది. మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఎండ్ కార్డ్ పడబోతున్నట్టు తెలుస్తోంది. ఇక 12 వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్ల రచ్చ అయిపోయింది. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. ఇక ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ల గోల స్టార్ట్ అయ్యింది. అందుకోసం కంటెండర్ ప్రక్రియ కూడా మొదలయ్యింది.

24
రంగంలోకి పాత కంటెస్టెంట్స్.

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనబోయే కంటెడర్ లను సెలక్ట్ చేయడం కోసం.. బిగ్ బాస్ కొత్త ఆలోచన చేశారు. పాత సీజన్ లో కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపాడు. మొదటి కంటెస్టెంట్ ను సెలక్ట్ చేయడం కోసం.. ప్రియాంక జైన్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఆమె వచ్చీ రావడంతోనే.. ఇంప్రెస్ చేయడానికి అందరు ప్రయత్నించారు. కంటెడర్ టాస్క్ కోసం.. తమను తీసుకోవాలని ప్రతీ ఒక్కరు ప్రియాంకను రిక్వెస్ట్ చేశారు. అయితే ప్రియాంక మాత్రం పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇవ్వగా.. ప్రియాంక జైన్ తో టాస్క్ ఆడిన కళ్యాణ్ టాస్క్ గెలిచి..కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు.

34
బిగ్ బాస్ ను లవర్స్ పార్క్ గా మార్చిన గౌతమ్

ఇక రెండో కంటెండర్ ను సెలక్ట్ చేయడం కోసం.. సీజన్ 8 లో రన్నర్ గా నిలిచిన గౌతమ్ ను హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. గౌతమ్ వచ్చీ రాగానే బిగ్ బాస్ హౌస్ ను లవర్స్ పార్క్ గా మార్చేశాడు. తనను ఎంటర్టైన్ చేయడం కోసం.. ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసే గేమ్ ను ఆడించాడు. అందులో భరణి సంజనాను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయగా.. సుమన్ శెట్టి మధ్యలో వచ్చి అడ్డు పడ్డాడు. సంజనాకు సుమన్ ప్రపోజ్ చేయడంతో పాటు చేతిపై ముద్దు కూడా పెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ రీతూను ఇంప్రెస్ చేసి, ప్రపోజ్ చేయగా.. డీమాన్ పవన్ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. ఇక తనూజను డీమాన్ పవన్ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయగా.. వర్కౌట్ అవ్వలేదు. దివ్యకు ఇమ్మాన్యుయోల్ కాస్త డిఫరెంట్ గా ప్రపోజ్ చేసిన నవ్వులు పూయించాడు. ఇలా అందరు తమకు వచ్చినంతలో ఎంటర్టైన్ చేశారు. అయితే ఈ గేమ్ అంతటిలో ఇమ్మాన్యుయోల్ మాత్రం తన కామెడీ టైమింగ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించాడు.

44
కన్నీరు పెట్టుకున్న భరణి.

ఇక కెప్టెన్సీ కంటెండర్ రేసులో భరణీని సెలక్ట్ చేసుకున్నాడు గౌతమ్. ఇద్దరు టాస్క్ ను హోరా హోరీగా ఆడారు. కానీ గౌతమ్ స్పీడ్ ముందు భరణి నిలబడలేక పోయాడు. చాలా త్వరగా టాస్క్ ను కంప్లీట్ చేసేశాడు. దాంతో భరణి కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయితే తన కూతురు హౌస్ లోకి వచ్చి ఒక్కసారి కెప్టెన్ అవ్వు నాన్నా అని అనడంతో.. అది సాధించలేకపోతున్నందుకు భరణి చాలా బాధపడ్డాడు. హౌస్ లో అందరు భరణిని ఓదార్చే ప్రయత్నం చేశారు.ఇక గౌతమ్ బయటకు వెళ్ళూ.. బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశాడు. ప్రతీ సీజన్ లో తనను ఇలానే పిలవాలని గౌతమ్ కోరుకున్నాడు. తనను ఈసారి పిలిచినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories