Brahmamudi Serial Today Episode: జాబ్ కోసం పబ్‍కెళ్లిన ఇందు, ఐశ్వర్యతో గొడవ పడ్డ నందు

Published : Mar 13, 2026, 10:10 AM IST

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. జాబ్ కోసం పబ్‍కెళ్లిన ఇందు,…రేఖకు దొరికిపోతుందా? మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

PREV
16
ఫ్రెండ్‍కు ఫోన్ చేసి జాబ్ ఓకే చేయించిన స్వాతి

ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే...అక్కడ పబ్‍లో చిల్ అవుతుంటారు...రాజు, అతని ఫ్రెండ్. ఇక్కడ స్వాతి వాళ్ల ఫ్రెండ్ సంతోష్‍కు ఫోన్ చేసి ఇందు కోసం జాబ్ అడుగుతుంది. సంతోష్ ఓకే చెప్పడంతో స్వాతి సంతోషంతో ఇందుకు ఈ విషయం చెప్తుంది. సంతోష్ వాళ్ల ఎండీతో పార్టీలో ఉన్నారంటా, వాళ్లకి నిన్ను పరిచయం చేస్తా అన్నాడని చెప్తుంది. ఇప్పుడే వెళ్దాం పద అంటుంది. ఇంత రాత్రిలో వెళ్లడం కరెక్ట్ కాదు అని ఇందు అంటుంది. నువ్వే చెప్పావ్ కదా...ఇప్పుడున్న అవకాశం రేపు మిస్ అవ్వచ్చని, అందుకే ఇప్పుడే వెళ్లాలని స్వాతి అంటుంది. నిజమే కాదని ఎవరో తెలియకుండా ఈ రాత్రి పూట వెళ్లడం ఎలా అని ఇందు సందేహ పడుతుంది. నువ్వు బయటకు వెళ్లవు కాబట్టి నీకేం తెలియదు గానీ...రాత్రి పూటే హైదరాబాద్ ఎంత బాగుంటుందో, అంతా ఇప్పుడే పనులు చేస్తుంటారని స్వాతి ఎగ్జైట్‍మెంట్‍తో చెప్తుంది. 

26
సడెన్‍గా రేఖ అడిగితే ఏం చెప్తామన్న అపర్ణ

సర్లే ఇంత దూరం వచ్చాక ఆగడమేందుకు, ఎలా వెళ్లాలి, ఎక్కడికి వెళ్లాలని ఇందు అడుగుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి ఎక్కడికే వెళ్లేది అని అంటుంది.మీ పాటికి మీరు నిర్ణయాలు తీసేసుకుంటున్నారని కోప్పడుతుంది. ఇంకెవరి అనుమతి తీసుకోవాలని నాన్నమ్మ.. రేఖ ఆంటీనే వెళ్లమంది కదా అని స్వాతి అంటుంది. రేఖ ఒప్పుకుంది ఉదయం పూట శివరాం ఇంటికి వెళ్లడానికి, ఇప్పుడిది రాత్రి వెళ్తా అంటోంది..సడెన్‍గా రేఖ అడిగితే ఏం చెప్తాం అని అపర్ణ అనుమానిస్తుంది. రేఖ ఆంటీ ఎప్పుడో తినేసింది, ఒక వేళ ఏదైనా కావాలంటే నేను ఉన్నాగా..నేను మేనేజ్ చేస్తా అంటుంది స్వాతి. ఇందు వెళ్లడానికి నాకేం ప్రాబ్లం లేదు..కానీ రాత్రి కదా అందుకే భయంగా ఉంది అనుకుంటుంది అపర్ణ. 

36
ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని దేవుడిని ప్రార్థించిన అపర్ణ

నాకూ వెళ్లడానికి ఇబ్బందిగానే ఉంది నాన్నమ్మ...కానీ అవకాశాలు మళ్లీ మళ్లీ రావు కదా అని అంటుంది ఇందు. ఇదంతా కరెక్టు కాదు అంటుంది అపర్ణ. సముద్రం లోతు ఎంతో తెలీదు అని ఆగిపోతే ఒడ్డునే మిగిలిపోతాం, ప్రయత్నిస్తే కదా గెలుస్తాం అంటుంది ఇందు. మీరు గెలుపు కోసం ఆలోచిస్తున్నారు. నేను ఓడిపోతే దాని పర్యవసానాల గురించి భయపడుతున్నా అంది అపర్ణ. రిస్క్ అన్ని చోట్లా ఉంటుంది, ఆ రిస్క్ ఏదో మనకు యూజ్ అయ్యేది చేస్తే ఇంకా మంచిది కదా అంటుంది స్వాతి. సరే...మీరు అంత నమ్ముతున్నప్పుడు, నేను ఎందుకు అడ్డుపడాలి అంది అపర్ణ. సరే స్వాతి నేను వాళ్లని ఎలా మీట్ అవ్వాలి, ఎక్కడ కలవాలి, నా దగ్గర ఫోన్ కూడా లేదు కదా అంటుంది ఇందు. అప్పుడు స్వాతి తన దగ్గరనున్న పాత ఫోన్ ఇచ్చి పంపుతుంది. జీవితంలో సొంతంగా నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తుంది, తన దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అని భగవంతుడిని వేడుకుంటుంది అపర్ణ. 

46
స్మగ్లర్‍ను పట్టుకోవడానికి పబ్‍కు వెళ్లి ఐశ్వర్యతో గొడవ పడ్డ నందు

ఇంతలో అదే పబ్‍కు వస్తుంది నందు. స్మగ్లర్‍ను పట్టడానికి ఇన్‍పార్మర్‍గా వస్తుంది. పబ్‍లో నందు, ఐశ్వర్య ఎదురెదురుగా డాష్ ఇచ్చుకుంటారు. నందు సారీ చెప్పినా కూడా ఐశ్వర్య నోరేసుకుని పడిపోతుంది. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇందు కూడా సంతోష్‍ను కలవడానికి పబ్‍కు వస్తుంది. భయంగానే లోపలికి వెళ్లి సంతోష్‍కు ఫోన్ చేస్తుంది.  

56
వెయిటర్‍తో గొడవ పడ్డ రాజు ఫ్రెండ్

ఇక అటు రాజు ఫ్రెండ్...వెయిటర్‍తో గొడవ పడతాడు. స్మగ్లర్‍ను నందు చూస్తుంది. అతను చూస్తాడని, అనుమానం రాకుండా పక్కనుంచి వెళ్తున్న వెంకీని లాగి డాన్స్ చేస్తుంది. సంతోష్ వెళ్లి ఇందును తీసుకొచ్చి ఎండీకి పరిచయం చేస్తుంది. ఇంటర్య్వూ పేరుతో ఇందును కూర్చోమంటాడు బాస్.  

66
క్రెడిట్ కార్డు పేరుతో సంతోష్‍ను బయటకు పంపించేసిన బాస్

ఇంతలో సంతోష్‍ను క్రెడిట్ కార్డు పేరుతో బయటకు పంపించేస్తాడు. ఇందుకు మందు తాగించేందుకు సంతోష్ ఎండీ ట్రై చేస్తాడు. కానీ ఇందు వద్దంటుంది. నిన్ను టెస్ట్ చేయడానికే అడిగా అని బుకాయిస్తాడు బాస్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories