Karthika Deepam 2 Today Episode: దోషిలా కార్తీక్- నింద తనపై వేసుకున్న దీప- దశరథను ఇరికించిన పారు

Published : Mar 13, 2026, 08:09 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 13వ తేదీ)లో జ్యోత్స్న, దీపను గన్ తో షూట్ చేసినట్లు ఊహించుకున్న దశరథ. అందరిముందు దోషిలా నిలబడ్డ కార్తీక్. బిడ్డను కనడం ఇష్టంలేకే అబద్ధం చెప్పానని నింద తనపై వేసుకున్న దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో దీపను, జ్యోత్స్న గన్ తో షూట్ చేసినట్లు ఊహించుకుంటాడు దశరథ. ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తాడు. అందరూ ఏమైందని అడుగుతారు. నేను నిజం చెప్తే జ్యోత్స్న, దీపను బ్రతకనివ్వదు. నేను తొందరపడకూడదు అని సైలెంట్ అవుతాడు దశరథ. 

నిజం బయటపడాలంటే వాళ్లను వీళ్లను కాదు దీపను అడగాలి. నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని స్ఫష్టంగా అర్థమైంది కదా కాంచన. అడుగు దీప ఏం చెప్తుందో అంటుంది పారిజాతం. బావ, దీప అబద్ధం చెప్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రూవ్ చేస్తానని జ్యోత్స్న చెప్తే నేను నమ్మలేదు. కానీ రిపోర్ట్స్ చూశాక మీ మీద నమ్మకం పోయింది అంటాడు శివన్నారాయణ.

27
బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు

తప్పు దీపది కాదు. కార్తీక్ ది, దీప పరాయిది. నా గురించి ఆలోచించకపోవచ్చు. కానీ నా కొడుకు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పు కార్తీక్ ఈ అమ్మతో ఎందుకు అబద్ధం చెప్పావు అని కార్తీక్ ని నిలదీస్తుంది కాంచన. బావను ఏం అనొద్దు అత్తయ్య అంటుంది దీప. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను దీప అంటుంది కాంచన. మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుంటే మంచిది అంటాడు కార్తీక్.

నాకు ఇప్పుడే నిజం తెలియాలి. నిజం చెప్పకుండా మీరు వెళ్తే నన్ను చంపినంత ఒట్టే అంటుంది కాంచన. బావ నిజం చెప్పలేడు అంటుంది దీప. ఎందుకు చెప్పలేడు అని అడుగుతుంది కాంచన. ఎందుకంటే.. కడుపులో బిడ్డను నేను వద్దనుకుంటున్నాను. ఈ బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది దీప. అంతా షాక్ అవుతారు.

37
సింధూరం చెరిపెయ్

మరోవైపు దాసు, ఈ రోజు మీ పెళ్లి రోజని మీలో ఒకరికైనా గుర్తుందా అని కాశీ, స్వప్నలను అడుగుతాడు. అంత గుర్తుంచుకోవాల్సిన రోజు ఏం కాదులే మామయ్య అంటుంది స్వప్న. అయితే తమరు పొరపాటున పాపిట్లో పెట్టుకున్న సింధూరాన్ని చెరిపేయండి అని స్వప్నతో అంటుంది కావేరి. షాక్ అవుతుంది స్వప్న. పోనీ నేను చెరిపేయనా అని అడుగుతుంది కావేరి. అత్తయ్య అంటాడు కాశీ. 

మీరు ఆగండి ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అర్థం అవుతుంది అంటుంది కావేరి. అంటే కాశీ తప్పేమి లేదా.. అంతా నా తప్పేనా.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటుంది స్వప్న. మంచి జీవితాన్ని పాడుచేసుకోవద్దు. పెళ్లి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు జరిగినవన్నీ గుర్తుచేసుకోండి. మీరు కలిసే అవకాశం ఉంటుంది అని కావేరి, దాసు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

47
తనపై నింద వేసుకున్న దీప

ఏం మాట్లాడుతున్నావు దీప. నిజంగా నువ్వు ఆ మాట అన్నావా.. లేక నేను తప్పుగా విన్నానా అని అడుగుతుంది కాంచన. నిజంగానే బిడ్డను కడుపులో మోయడం నాకు ఇష్టం లేదు. అందుకే బావ చేత అబద్ధం చెప్పించానని నింద మొత్తం తనపై వేసుకుంటుంది దీప. 

57
నాకు ఎందుకు మాటిచ్చావ్?

అలాంటప్పుడు నాకు మాట ఎందుకు ఇచ్చావ్ అని అడుగుతుంది కాంచన. ఇప్పుడు వద్దు అనుకుంటే మరోసారి కనాలి అనుకుంటున్నావా? అని అడుగుతుంది కాంచన. అప్పుడే డాక్టర్ జ్యోత్స్నకు మరోసారి పిల్లలు పుట్టే అవకాశం లేదని వాయిస్ మెసేజ్ పెడుతుంది. అది జ్యోత్స్న అందరికీ వినిపిస్తుంది.

67
శివన్నారాయణ ఎమోషనల్

మళ్లీ పిల్లలు పుట్టరనే నిజం తెలిసి కూడా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా అని అంతా షాక్ అవుతారు. దీప, నేను కలిసే నిర్ణయం తీసుకున్నాము, ఇంకా గట్టిగా చెప్పాలంటే నిర్ణయం నాదే అని కుండ బద్ధలు కొడుతాడు కార్తీక్. ఆ మాటలకు ఎమోషనల్ అవుతాడు శివన్నారాయణ. అంత ఈజీగా బిడ్డను వదిలేసుకుంటున్నామని ఎలా చెప్తున్నారు. మీరు మనుషులేనా అన్నట్లు మాట్లాడతాడు శివన్నారాయణ. సుమిత్ర ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంతమందిమి తాపత్రయపడుతుంటే చూసి కూడా.. మరో ప్రాణాన్ని ఎలా వదులుకోవాలి అనుకుంటున్నారు అంటాడు శివన్నారాయణ. 

77
దశరథకు నిజం ముందే తెలుసు

డాడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు. దీపను ఎందుకు నిలదీయట్లేదు అంటుంది జ్యోత్స్న. మాట్లాడు దశరథ... నువ్వు దీపను కూతురిగా అనుకున్నావు. ఈ రోజు నీ కూతురు అల్లుడు కలిసి, కడుపులో బిడ్డను చంపేస్తుంటే సైలెంట్ గా ఉన్నావేంటి అంటాడు శివన్నారాయణ. 

దశరథకు ఈ విషయం ముందే తెలుసు. కానీ నిజాన్ని దాచాడు అంటుంది పారిజాతం. అంతా షాక్ అవుతారు. అత్తయ్య చెప్పేది నిజమా బావ అంటాడు శ్రీధర్. నేనేదో అబద్ధాలు చెప్పుతూ తిరిగేదానిలాగా నిజమా అంటావేంటి అల్లుడు నిజమే, దశరథకు ముందే తెలుసు అంటుంది పారిజాతం. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories