Published : Nov 25, 2025, 12:35 PM ISTUpdated : Nov 25, 2025, 12:52 PM IST
Prabhas Director Apologizes to NTR Fans : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియాాలో క్షమాపణలు తెలిపాడు ప్రభాస్ డైరెక్టర్ మారుతి. అసలు ఆయన ఏం చేశారు? ఎందుకు సారీ చెప్పాడు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి త్వరలో రాబోతున్న పాన్ ఇండియా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘రాజాసాబ్. సంక్రాంతి కానుకగా అభిమానులను అలరించబోతున్న రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్.. ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను, రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ అభిమానులకోసం వరుసగా అప్ డేట్స్ రాబోతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మారుతీ చేసిన కామెంట్స్ కొన్ని ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీశాయి.
25
ప్రభాస్ కటౌట్ గురించి కామెంట్స్
రాజాసాబ్ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా రాజాసాబ్ అప్‌డేట్స్ ఆలస్యంపై స్పందించిన మారుతీ.. కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. రాజా సాబ్ నుంచి ఇక ముందు వరుసగా అప్‌డేట్స్ వస్తాయని అభిమానులకు హామీ ఇచ్చారు మారుతి. తరువాత మాట్లాడుతూ, “నాకు ఇలా కలర్స్ ఎగరేయడం అనే మాటలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పినా ప్రభాస్ కటౌట్‌కు చాలా చిన్నదవుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ బాగా వైరల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
35
వార్ 2 ఈవెంట్ లో కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్..
అయితే మారుతీ డైలాగ్స్ ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించాయి. ఎందుకంటే.. రీసెంట్ గా తారక్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 ఈవెంట్‌లో.. ఎన్టీఆర్ డబుల్ కాలర్‌లు ఎగరేద్దాం అన్నాడు. ఈ స్టేట్‌మెంట్‌ను అభిమానులు బాగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ వార్ 2 మూవీ ప్లాప్ అయ్యింది. ఇక మారుతీ చేసిన వ్యాఖ్యలని ఎన్టీఆర్ స్టేట్‌మెంట్‌తో పోల్చి, కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. మారుతీ కావాలనే ఎన్టీఆర్‌ను టీజ్ చేసినట్టుగా ఆరోపణలు చేస్తూ హాష్‌ట్యాగ్ ట్రోలింగ్ కూడా ప్రారంభించారు. దాంతో ఈ విషయంలో మారుతీ వివరణ ఇవ్వక తప్పలేదు.
మారుతీ కామెంట్స్ ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానుల మధ్య గొడవలకు కారణం అయ్యింది. అంతే కాదు సోషల్ మీడియాలో విమర్శలకు కూడా ఇది కారణం అవ్వడం.. వివాదం తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు మారుతీ స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ముందుగా అభిమానులకు నా క్షమాపణలు. నేను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా మాటల వల్ల ఎవరికైనా మనసుకు నొప్పి కలిగితే హృదయపూర్వక క్షమాపణలు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనను ఉద్దేశించి నేను మాట్లాడలేదు” అని స్పష్టం చేశారు.
55
అభిమానులు శాంతిస్తారా?
మారుతీ క్షమాపణలు చెప్పిన పోస్ట్ సూపర్ ఫాస్ట్ గా వైరల్ అయ్యింది. చాలా కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారు, వివాదం ఇక్కడితో ముగుస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ మరింత జోరందుకునే సమయంలో.. ఇలా స్టార్ హీరో అభిమానుల కోపానికి గురైతే.. సినిమాపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే మారుతి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ హారర్ కామెడీ జానర్ లో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తుండటంతో.. అభిమానులు ఈసినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.