తనూజను వదిలేసి రమ్య వెంట పడ్డ ఇమ్మాన్యుయల్, వైల్డ్ కార్డ్స్ వల్ల బిగ్ బాస్ హౌస్ లో గొడవలు

Published : Oct 16, 2025, 11:19 PM IST

వైల్డ్ కార్డ్ ఎంట్రీ తరువాత బిగ్ బాస్ హౌస్ మరింత దారుణంగా తయారయ్యింది. ఒక వైపు పులిహోర రాజాలు పెరిగిపోయారు, మాధురి మాటల యుద్ధం కొనసాగుతుండగా.. టాస్క్ ల విషయంలో కొట్టుకు చస్తున్నారు కంటెస్టెంట్స్

PREV
14
రణరంగంలా మారిన బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకీ మరింత దారుణంగా తయారు అవుతోంది. మిగతా సీజన్లతో పోలిస్తే ఈసీజన్ నిజంగానే రణరంగంలా మారింది. ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ కలగలిపి ఆడియన్స్ కు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో బిగ్ బాస్ మరిత వైల్డ్‌గా మారుతోంది.మరీ ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి వచ్చిన తరువాత టాస్క్ లు , నామినేషన్ల తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గేమ్‌లో గెలవాలనే తపనతో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అటు మాధురి ఏమాత్రం తగ్గడంలేదు. తాజా ఎపిసోడ్ లో కూడా మాధురి, రీతూమధ్య మాటల యుద్దం జరిగింది.

24
కెప్టెన్సీ టాస్క్ లో

తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఓ వైల్డ్ గేమ్ ఇచ్చిన బిగ్ బాస్, కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో నిర్వహించిన ఈ గోల్ టాస్క్‌లో కంటెస్టెంట్లు బంతిని తమ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌లో వేసే ప్రయత్నం చేశారు. అయితే ఆట మొదలైన కాసేపటికే అది పూర్తిగా ఫిజికల్‌గా మారింది. గేమ్‌లో భాగంగా భరణిని అదుపు చేసే సమయంలో రమ్య కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు గట్టిగా తగలడంతో వెంటనే ఆమె ఆట నుంచి వైదొలిగింది. ఈ గాయం కారణంగా మిగతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు టాస్క్‌లో ఉన్న తోపులాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై తనూజ స్పందిస్తూ, వైలెన్స్ మొదలుపెట్టింది మీరు కదా” అంటూ కౌంటర్ ఇచ్చింది.

34
ఈసారి అవకాశం వారికే

కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించి, మొదటగా ఈ వారమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చారు. అయితే చివర్లో బిగ్ బాస్ కీలక ట్విస్ట్ ఇచ్చాడు – కెప్టెన్సీ కంటెండర్షిప్‌ను కాపాడుకోవడం కూడా వారి బాధ్యతే అని అన్నాడు. అంటే మిగతా ఇంటి సభ్యులూ ఆటలో భాగమని స్పష్టం చేశారు. ఈ టాస్క్‌ చివరికి ముగ్గురు కంటెస్టెంట్లు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో సుమన్, గౌరవ్, గత వారం నాగార్జున ఇచ్చిన పవర్ ద్వారా నిఖిల్ కూడా ఈ పోటీలో చేరారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎంపిక కానున్నారు.

44
రమ్య వెంటపడ్డ ఇమ్మాన్యుయేల్

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు జరిగినా..ఫన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు ఇమ్మాన్యుయేల్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనసు కూడా దోచుకున్నాడు ఇమ్ము. గతంలో తనజా వెంట పడ్డ ఇమ్మాన్యుయేల్.. తాజాగా రమ్యా వెంట పడుతున్నాడు. అపరిచితుడులో రాములా మారిపోయి.. రమ్యతో చిన్న స్కిట్ ప్లే చేశాడు. రాము చేసిన పెర్పామెన్స్ కు అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు, ఏడుపుల నుంచి ఇమ్మాన్యుయేల్ కామెడీ ఆడియన్స్ ను కాస్త కాపాడిందని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories