Intinti Gruhalakshmi: లాస్య నిజ స్వరూపం తెలుసుకున్న అంకిత.. ఆనందంలో సామ్రాట్, తులసి?

First Published Dec 15, 2022, 9:11 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో తులసి,సామ్రాట్ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు తులసి ఇప్పుడు నా మనసు నా మనసులో లేదు చిన్నతనం లోకి వెళ్ళిపోయింది సామ్రాట్ గారు అని అనగా వెంటనే సామ్రాట్ అది అర్థమవుతుంది కానీ బాల్యంలోకి వెళ్లిపోతే మళ్ళీ తిరిగి రావాలి కదా అనగాకదా అని అనడంతో తప్పదు కదా ఆంటీ అని సారీ సారీ తులసి గారు అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి దేవుడు ప్రతి ఒక్కరికి రెండు బాల్యాలు ఇవ్వచ్చు కదా ఎందుకంత పిసినారితనం అనడంతో అదేంటంటే ఇచ్చారు కదా ఒకటి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రెండోది వృద్ధులుగా ఉన్నప్పుడు అని అంటాడు సామ్రాట్.
 

కాకపోతే మొదటి బాల్యంలో అమ్మ చేయి పట్టుకొని నడిపిస్తే రెండవ బాల్యంలో మన పిల్లలు మనకు చేతులు పట్టుకొని నడిపించి గోరుముద్దలు ఇప్పిస్తారు అని చెబుతాడు సామ్రాట్. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడ ఒక ఇల్లు కనిపించడంతో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడు తులసి ఆ ఇంటిని చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది.  చిన్నప్పుడు నేను ఇక్కడే మా తమ్ముడు తో కలిసి దాగుడుమూతలు తొక్కుడు బిళ్ళ ఆడుకునే వాళ్ళం అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సామ్రాట్ కి చెబుతూ ఉంటుంది తులసి. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇరుకు పొరుగు వాళ్ళు మమ్మల్ని ఇద్దరినీ ఏమి అన్న పట్టించుకోకుండా సరదాగా ఉండే వాళ్ళము అని అంటుంది తులసి.
 

 ఆ తర్వాత ఇంటికి సీల్ వేసి ఉండటంతో ఈ ఇల్లు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది మా తమ్ముడు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాడు అందుకే మేము ఈ ఊరికి రావాలి అంటే రాము అని బాధగా మాట్లాడుతుంది తులసి. అప్పుడు సామ్రాట్ తులసి బాధ చూడలేక ఆ ఇంటి తాళాలను పగలగొడతాడు. అప్పుడు తులసి వద్దండి ఇది చాలా పెద్దగా ఏది అవుతుంది అని అనగా నేను కేసులో ఇరుక్కుంటే మీకేంటండి ప్రాబ్లం మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి అని అంటాడు. అప్పుడు తులసి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ ఇంటి తాళాలని పగలగొట్టడంతో అవి చూసి తులసి సంతోషపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తులసి అక్కడ అట్మాస్ఫియర్ చూసి తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.
 

మరొకవైపు అంకిత హాస్పిటల్ కి బయలుదేరుతూ ఉండగా అక్కడ పేషెంట్లను చూసి ఇక్కడ కూర్చున్నారు ఏంటి మీరు ఫస్ట్ లేవండి వెళ్లి అక్కడ కూర్చోండి అని వారిని అక్కడికి పిలుచుకొని వెళ్తుంది అంకిత. అప్పుడు అంకిత హెల్త్ చెక్ చేసి పనికి వెళ్లొద్దు అని అనగా లేదమ్మా మాకు పనికి వెళ్లకపోతే పూట గడవదు అనడంతో జ్వరం తగ్గడానికి కచ్చితంగా మూడు రోజులు టైం పడుతుంది ఇంటి దగ్గరే ఉండు అని అంటుంది అంకిత. అప్పుడు అంకిత టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళమని చెప్పగా వాళ్ళు అమ్మ ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు కదా పాత బిల్లు కూడా చెప్తే అప్పుడు ఇంత చేస్తాము అనగా అంకిత ఆశ్చర్య పోతుంది. ఇప్పుడు నేను డబ్బులు తీసుకోవడం ఏంటి అని అనడంతో వాళ్ళు జరిగింది మొత్తం చెప్పగా అంకిత షాక్ అవుతుంది.
 

అప్పుడు అంకిత వాళ్లకు 500 ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోమని చెబుతుంది. మరొకవైపు తులసి సామ్రాట్ తులసి వాళ్ళ ఇంటిదగ్గర చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడు తులసి అక్కడ తులసి కోటని మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న బావిలో ఉన్న నీరు తీసుకొని వచ్చి తులసి చెట్టుకి పోసి పూజ చేస్తూ ఉండగా అప్పుడు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్  మీరు చిన్న వయసులోనే మీ అమ్మగారితో చాలా పనులు నేర్చుకున్నట్టు ఉన్నారు అని ఎంతో తులసి అప్పటి విషయాలను సంతోషంగా చెబుతూ ఆనందపడుతూ ఉంటుంది. అక్కడ తన తమ్ముడు తన తల్లితో కలిసి చేసిన పనులు అన్ని గుర్తు తెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటుంది తులసి.
 

ఆ తర్వాత తులసి ఇంటి వాకిలి వైపు చూసి మురిసిపోతూ ఉండగా అప్పుడు ఆ ఇంటి తలుపులకు ఉన్న తలని పగలగొట్టాలి అని చూడగా తులసి వద్దండి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.  ఎందుకు తులసి గారు అంత టెన్షన్ పడుతున్నారు కళ్ళముందు అమృతం ఉన్న రెండు చుక్కలు వేసుకుని చాలు అని అనడం మూర్ఖత్వం అని అంటాడు. తులసి ఎంత చెప్పినా సామ్రాట్ వినిపించుకోకుండా ఆ ఇంటి లోపలికి వెళ్తాడు సామ్రాట్.

click me!