ఘనంగా జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్‌ దీప్‌- తేజస్విని పెళ్లి, వైరల్ అవుతున్న ఫోటోస్

Published : Dec 15, 2022, 08:13 AM IST

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మెగుతున్నాయి. వెండితెర స్టార్స్ తో పాటు..బుల్లితెర తారలు కూడా పెళ్ళిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా జానకి కలగనలేదు సీరియస్ హీరో అమర్ దీప్ పెళ్ళి ఘనంగా జరిగింది

PREV
19
ఘనంగా జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్‌ దీప్‌- తేజస్విని పెళ్లి, వైరల్ అవుతున్న ఫోటోస్

టాలీవుడ్ లో వరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. అటు సినిమా తారలు.. ఇటు టెలివిజన్ స్టార్స్ ఇళ్ళలో వరుస పెళ్లిళ్ళతో సందడి వాతావరణం నెలకొంది. తాజాగా జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్‌దీప్‌ చౌదరి.. కోయిలమ్మ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడల వివాహం చాలా ఘనంగా జరిగింది. 

29

చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట నిన్న అనగా డిసెంబర్ 14న పెళ్ళిని కూడా అంతే గ్రాండ్ గా జరుపుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ వేడుకలకు అతికొద్ది మంది బందువులతో పాటు.. కొద్ది మంది కోస్టార్స్  హాజరయ్యి సందడి చేశారు. 

39

అంతకు ముందు జరిగిన రిసెప్షెన్.. ఆతరువాత జరిగిన హల్దీ వేడుకలు, మోహందీ వేడుకల్లో కూడా ఈ ఇద్దరు తారలతో పాటు.. సీరియల్ స్టార్స్ కొంత మంది  సందడి చేశరు. 
 

49

జనకి కలగనలేదు టీమ్ లో కొంత మంది టీమ్ తో పాటు.. గతంలో అమర్ దీప్ తో పని చేసిన స్టార్స్.. ఆర్ జే కాజల్, తేజస్వీని బుల్లితెర ఫ్రెండ్స్.. కొద్ది మంది సిల్వర్ స్క్రీన్ తారలు కూడా  పెళ్ళికి హాజరయ్యారు. 
 

59

వీరి పెళ్ళిలో కోలాహలం అంతా బుల్లి తెర తారలదే.. పెళ్లి అయిపోవడంతో.. రిసెప్షన్  కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు. అంతా బుల్లితెర తారలే హాజరవుతారనిసమాచారం. అమర్ దీప్ టీమ్ తో పాటు.. తెలుగు, కన్నడ తారలు ఈ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారు. 

69

వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పెళ్ళి ఫోటోలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. 
 

79

ఇక ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు అమర్ దీప్.  కోయిలమ్మతో ఫేమస్ అయ్యింది తేజస్వీని, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడంలో.. చాలా కాలం ప్రేమలో మునిగితేలిన జంట.. పెద్దలను ఒప్పించి ఒక ఇంటివారు అయ్యారు. 
 

89

జానకి కలగనలేదు సీరియల్‌లో రామాగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన అమర్ దీప్.. అంతకు ముందు సిరిసిరిమువ్వ, `ఉయ్యాల జంపాల` సీరియల్స్‌తో పేరుతెచ్చుకున్నాడు. అటు సీరియల్స్ చేస్తూనే వెబ్ సిరీస్, ఓటీటీ కంటెంట్ సినిమాల్లో నటిస్తున్నాడు. 
 

99

ఇక తేజస్విని గౌడ.. కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. అమర్ దీప్‌ది అనంతపురం అయితే.. తేజస్విని గౌడది బెంగళూరు. బీటెక్ పూర్తి చేసిన తేజస్విని గౌడ.. తమిళ్, కన్నడలలో అనేక సీరియల్స్ చేసి.. తెలుగులో కోయిలమ్మ సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories