Guppedantha Manasu: దేవయాని మాటలకు ఇంటి నుంచి వెళ్లిపోయిన వసుధార.. సంతోషంలో రిషి?

Published : Dec 15, 2022, 07:50 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
18
Guppedantha Manasu: దేవయాని మాటలకు ఇంటి నుంచి వెళ్లిపోయిన వసుధార.. సంతోషంలో రిషి?

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని కాలేజీ స్టాప్ తో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మనం ఓడిపోయి ఎదుటివారిని గెలిపించాలి. ఇక్కడికి జరిగింది కూడా అదే. ఇప్పుడు వసుధార కాదు గెలిచింది నేను అని అంటుంది దేవయాని. అప్పుడు కాలేజీ స్టాఫ్ వాళ్ళు దేవయాని మాటలు అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని రిషికి నేనంటే ఇష్టం రిషికి నేను పెద్దమ్మని నేను ఏది చెబితే అది వింటాడు. ప్రేమను చూపిస్తాను. కానీ నేను చేసేది చేస్తాను అందులో ఇది కూడా ఒకటి అని అంటుంది దేవయాని.
 

28

అప్పుడు మేడం ఇవన్నీ మీరు బాగానే చెబుతున్నారు కానీ జగతి మేడం స్థానంలో వసుధార కూర్చుంటే మన కూర్చుని చప్పట్లు కొడదామా అని వాళ్ళు అడగగా, అప్పుడు దేవయాని నవ్వుకుంటూ మీకు నా గురించి అంతగా తెలియదు వాళ్ళు ఒక గెలుపు వచ్చిందని సంతోషంలో ఉంటారు ఆ కొంచెం ఏమరు పాటులో మనం ఊహించిన దెబ్బ కొట్టాము అంటే చాలు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు వసుదార నే ఆయుధాలు ఇస్తుంది అని అంటుంది దేవయాని. మరొకవైపు జగతి వసుధార ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జగతీ కంగ్రాట్యులేషన్స్ వసు ఇది నీకు పెద్ద విజయం అనడంతో ఇది నా విజయం కాదు మేడం మీది రిషి సార్ ది అని అంటుంది.
 

38

 అదేంటి వసుధార అనగా నా గెలుపు వెనక మీరే కదా మేడమ్ ఉండేది అని అంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి వసుధారని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కాలేజీ స్టాఫ్ వస్తారు. అప్పుడు కంగ్రాట్యులేషన్స్ వసుధార అనడంతో గెలుపుని ఆపాలని చాలామంది లోపల ప్రయత్నాలు చేశారు లేండి మేడం అని అంటుంది. అప్పుడు కాలేజీ స్టాప్ వసుధార నీ తెలివితేటలు చూస్తే ముచ్చటేస్తోందమ్మ అనడంతో పక్కనే ఉన్న ఇంకొక మేడం తెలివితేటలు కాదు మేడం మేదస్సు అని అంటుంది.
 

48

అప్పుడు వసుధార మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు అని అనగా అప్పుడు వాళ్లు వెటకారంగా మాట్లాడిస్తూ నువ్వు ఎంత తెలివి దానివంటే ఎవరినైనా ఇట్లే బుట్టలో వేసుకుంటావు అనడంతో వసుధార షాక్ అవుతుంది. రిషి సార్ ని బుట్టలో వేసుకోకపోతే నీ ఆటలు ఇలా సాగుతాయా చెప్పు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతారు. అప్పుడు వసుధార మర్యాదగా మాట్లాడండి అని అంటుంది. ఈ కాలేజీలో నువ్వు కేవలం స్టూడెంట్వి మాత్రమే కాదు వసుధార ఎండి తర్వాత ఎండి లాంటి దానివి అంటారు. ఎందుకు మేడం నా మీద మీకు ఇంత కోపము అని అనగా మీ మీద మాకెందుకు వసుధార కోపము నీతో వైరం పెట్టుకుంటే మాకు మనుగడే ఉండదని ఇప్పుడు తెలుసుకున్నాము అనడంతో వసుధార షాక్ అవుతుంది.
 

58

అప్పుడు కాలేజీ స్టాఫ్ నోటికి వచ్చిన విధంగా మాట్లాడి వసుధారని బాధ పెడతారు. ఇప్పుడు వసుధార కోపంతో ఆపుతారా లేదా అనగా వాళ్లు కూడా ధైర్యం చేసి మేము తప్పుగా మాట్లాడాము ఉన్నదే కదా మాట్లాడాము అంటారు. వసు,రిషి ల గురించి తప్పుగా మాట్లాడుతూ లివింగ్ టుగెదర్ అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వసుధార ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా అలాగే మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసుధర ఆటోలో వెళుతూ కాలేజీ స్టాప్ అన్న మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి వసుధార కోసం వెతుకుతూ ఉండగా ఇప్పుడే కాలేజీ బయటకు వెళ్లడం చూశాను అని అంటాడు మహేంద్ర.

68

మరొకవైపు వసుధార జగతి ఒడిలో తల పెట్టుకుని జరిగిన విషయాన్ని జగతికి చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జగతి కూడా బాధపడుతూ ఉంటుంది. కాలేజీ స్టాప్ కి అంత ధైర్యం ఎలా వచ్చిందో  వాళ్ళ వెనకాల ఎవరున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. మీ గురు శిష్యులు ఇలా ఉంటే నాకు చూడ్డానికి ఎంత సంతోషంగా ఉందో అని దేవయాని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు జగతి వసుధార ఇప్పటికే బాధలో ఉంది తనని మీరు ఏమి అనకండి అనడంతో దేవయాని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. సిగ్గు లేకుండా ఇక్కడికి వస్తావని అనుకోలేదు వసుధార అనడంతో మర్యాదగా మాట్లాడండి అక్కయ్య అని అంటుంది జగతి. అప్పుడు దేవయాని మర్యాద అంటే ఏమిటి జగతి అర్ధరాత్రి అపరాత్రులు కలిసి తిరగడమేనా మర్యాద అంటే అని అంటుంది.
 

78

నేను ఎక్కడికి వెళ్ళినా నా హద్దుల్లో నేను ఉంటాను అని అనగా వెంటనే దేవయాని హద్దుల గురించి నువ్వు మాట్లాడకు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు వసుధార దేవయాని మాటలకు వెంటనే సీరియస్ అవుతుంది. మేడం నేను ఇంటికి వస్తే మీకేంటి ఇబ్బంది అని ప్రశ్నిస్తుంది వసుధార. అప్పుడు వెంటనే దేవయాని మీ ఇంటికి రావడానికి మీకు ఏం హక్కు ఉంది అని అడుగుతుంది. అప్పుడు దేవయాని మాటలకు వసుధార మౌనంగా ఉంటుంది. ఈరోజు నేను అడిగిన ప్రశ్న లోకం రే ప్రొద్దున అడుగుతుంది అప్పుడు ఏం చెప్తావు అని అనగా మీరు ఏ అర్హత గురించి అడుగుతున్నారో అది అర్హతతో ఇదే ఇంట్లో నేను అడుగు పెడతాను అని అంటుంది. 

88

అంతేకాకుండా మీ రేంటో మీ బుద్ధులేంటో రిషి సార్ కి తెలిసేలా చేస్తాను అని దేవయానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసు. ఇంతలో ధరణి అక్కడ ఉండగా దేవయాని అక్కడికి వస్తుంది. మరొకవైపు రిషి వసుధార కోసం ప్రేమగా బొకే తీసుకుని మురిసిపోతూ ఉంటాడు. మరొకవైపు దేవయాని జరిగిన విషయాన్ని తలుచుకొని సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ధరణి అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడడంతో దేవయాని ఇన్ని మాట అన్నా ఈరోజు నాకు కోపం రాదు అని సంతోష పడుతూ ఉంటుంది.

click me!

Recommended Stories