Intinti Gruhalakshmi: సామ్రాట్, తులసిల జంట బాగుందంటూ టీవీలో వార్తలు.. కుమిలిపోయిన అభి!

First Published Sep 28, 2022, 12:31 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..తులసి, సామ్రాట్ గారు చెల్లెళ్లకు ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ వల్ల బాబాయి జరిగిన గతమంతా చెప్తాడు. సామ్రాట్ కి చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో తన చెల్లె లోకం అని బతికాడు. చిన్నప్పటి నుంచి తన చెల్లితోనే గడిపేవాడు. సునంద కూడా వాళ్ళ అన్నయ్యకి ఎప్పుడు ఎదురు మాట మాట్లాడేది కాదు. కానీ ప్రేమ విషయంలో మాత్రం సునంద సామ్రాట్ మేనేజర్ ని ప్రేమించింది ఆ విషయం సామ్రాట్ కి చెప్పింది కానీ ఒప్పుకోలేదు.అతని వ్యక్తిత్వం మంచిది కాదు అని ఎంత చెప్పినా సునంద వినలేదు. చెల్లెలు బాధపడడం చూసి సామ్రాట్ పెళ్ళికి ఒప్పుకున్నాడు ఇద్దరికీ పెళ్లి చేసి సునంద భర్త కి ఆస్తిలో సగభాగాన్ని కూడా రాసిచ్చాడు. 

కానీ పెళ్లయి హనీ పుట్టిన తర్వాత సునందని తను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. పుట్టింటికి పంపించి డబ్బులు ఇంకా తీసుకురా అని ఎంత తీసుకొచ్చిన సరిపెట్టుకునే వాడు కాదు. తన వల్ల వాళ్ళ అన్నయ్య జీవితం పాడవకూడదు అని చెప్పి హనీ ని సామ్రాట్ ఇంటి గుమ్మమెదురున  పెట్టి తను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సామ్రాట్ ఎంతో బాధపడ్డాడు ఆ బాధలో హనీ తనకు వెలుగుగా నిలిచింది.సునంద భర్తని జైల్లో పెట్టించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు హనీలో సునందను చూసుకుంటూ గడిపాడు.ఇప్పటికీ నిజం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు కానీ అభి ఇంతలా అనేసరికి నేను చెప్పలేకపోకుండా ఉండలేకపోయాను అని అనగా తులసి,అభి చేసిన పొరపాటున కి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఇన్ని రోజులు ఇంత బాధ మీలో దాచుకున్నారు అని అనగా సామ్రాట్, అందుకే నేను హనీ ని మీ ఇంటికి పంపలేదు.

హనీని విడిచి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఈ విషయం హనీ కి తెలియకూడదు. పాపం తను తల్లి,తండ్రి లేని అనాధ అని తెలిస్తే బాధపడుతుంది అని అంటుంది. అప్పుడు లాస్య,ఎంత కష్టపడి కథంతా అల్లితే చివరిలో క్లైమాక్స్ ఇలా మారిపోతుంది అని అనుకోలేదు అని అనుకుంటుంది. అప్పుడు తులసి, అందరి తరపున నేను మాటిస్తున్నాను ఈ విషయం హనీకి ఎప్పటికీ తెలియదు అని అంటుంది. నందు లాస్యలు కూడా మేము చెప్పము అని అంటారు. ఇంక అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత నందు,లాస్య లు వాళ్ళింటికి వెళ్లిన తర్వాత నందు లాస్యతో,ఏదో పొడిచేస్తాను అన్నావు ఇంత ప్లానేసింది దీని కోసమేనా అని అడగగా నేను పని జరుగుతుందని అనుకున్నాను.

కానీ చివరి నిమిషంలో కథ ఇలా మలుపు తీర్పుతుందని నాకు మాత్రమే ఏం తెలుసు అయినా మనకి ఇప్పుడు ఇంకొక ఆస్త్రం ఉంది. ఇప్పటివరకు తులసి ఇంట్లో వాళ్ళు సామ్రాట్ ని అనుమానించలేదు ఎందుకు? సామ్రాట్ పెళ్లయినవాడని.కానీ ఇప్పుడు సామ్రాట్ బ్రహ్మచారి అని తెలిసింది కదా మన పెళ్లికి ముందు మీ అమ్మగారు మనకు ఎంత సపోర్ట్ గా ఉన్నారు, దాని తర్వాత తులసి వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ మన వైపు తెచ్చుకుందాము ప్రయత్నిస్తే ఏదైనా అవుతది అని అంటుంది లాస్య. ఆ తర్వాత సీన్లో పరంధామయ్య, సామ్రాట్ గతమంతా గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తున్నారు మావయ్య అని తులసి వచ్చి అడగగా ఆయన మనసులో ఎంత బాధగా ఉన్నా హనీ ని సొంత కూతురు లా చూసుకుంటున్నారు అమ్మ అని అనుకుంటాడు.
 

ఆ తర్వాత సీన్లో హనీ సామ్రాట్ దగ్గరికి వెళ్లి, నాన్న నువ్వు ఎందుకలా బాధగా ఉన్నావు?నీకు ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు నేను తీరుస్తాను అని అంటుంది.అప్పుడు సామ్రాట్ నా బాధను తీరుస్తావా? ఎలాగా? అని అనగా హనీ అబ్రకదబ్ర నీ బాధంతా పోయింది అని అంటుంది హనీ.ఇంత తేలిగ్గా బాధలు పోతాయి నాకు తెలియదమ్మా అని అని సామ్రాట్ నవ్వుతూ హని తో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో టీవీలో సామ్రాట్ తులసిని గురించి మాట్లాడుతూ, తులసి గారు విడాకులు అయిపోయినా సరే తన జీవితంలో ఒంటరిగా ఎంతో ఎదుగుతున్నారు.అలాంటి మహిళలను మనం ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోవాలి కానీ మరోవైపు సామ్రాట్ గారు తన పెళ్లి గురించి అడిగితే మౌనంగా ఉండిపోయారు. తులసి గారు వద్దు అని అంత స్పష్టంగా చెప్పారు కానీ సామ్రాట్ గారి మౌనం వెనుక ఏమున్నాదో సామ్రాట్ గారికే తెలియాలి. 

అయినా వీళ్ళిద్దరి జంట చాలా చూడముచ్చటగానే ఉన్నది విడాకులైన తర్వాత పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు అని వాళ్ళు అంటారు.అప్పుడు సామ్రాట్ ఈ న్యూస్ ని చూసి ఏమీ లేనప్పుడు కూడా ఎందుకు ఇంత సాగదీస్తున్నారు అని అనుకుంటాడు.మరోవైపు తులసి కుటుంబంలో అభి, చూశావా అమ్మ ఇదంతా సామ్రాట్ గారు మౌనంగా ఉండడం వల్లే జరిగింది అని అనగా ప్రేమ్, సామ్రాట్ గారు మౌనంగా ఎందుకు ఉన్నారో మనకు స్పష్టంగా చెప్పారు కదా మళ్లీ దాని గురించి మాట్లాడడం ఎందుకు అని అంటాడు. అప్పుడు అభి, మనకు తెలిస్తే సరిపోదు ఎదుటి వాళ్ళకి ఆ తెలీదు కదా వాళ్ళు నాన్న రకాలుగా అనుకుంటున్నారు అని అనగా,అలా వ్యక్తిగత విషయాలు బహిరంగంగా పెట్టడం వల్ల మనకి ఏమీ లాభం లేదు అది సామ్రాట్ గారి వ్యక్తిగతం నలుగురు ఏమనుకున్నారా అనేది మనకేంటి అవసరం అని ఇంట్లో వాళ్ళు అంటారు.

అప్పుడు ప్రేమ్ వచ్చి,ఎందుకురా ఎప్పుడూ అమ్మనే తప్పు పట్టిస్తున్నవు. ఒక మగవాడిలా కాకుండా ఒక కొడుకుల ఆలోచించు అప్పుడు తెలుస్తుంది అని అంటాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ప్రేమ్ చేసి సపోర్ట్ చేయగా అభి కోపంతో, ఆ రోజు నాకు ఆస్తి ఇవ్వలేదు అని నేను బాధపడ్డాను కానీ ఆ బాధ కొంచెం సేపు మాత్రమే అలాగని తల్లిని ఎదగకుండా ఆపేయంత కిరాతకుడిని నేను కాదు.మామ్ అంటే నాకు కూడా ఇష్టమే కానీ మీరు చూపిస్తున్నారు నాకు చూపించడం తెలియదు. మా అమ్మని నేను చెడ్డదారిలో వెళ్లకుండా కాపాడుకోవాలని ఇదంతా చేస్తున్నాను.
 

 నాకు మా అమ్మంటే ఇష్టమే. నేను ఎన్ని తప్పులు చేసినా మా అమ్మ నాకు ప్రాణ భిక్ష పెట్టింది, చాలాసార్లు సహాయం చేసింది.అలాంటి అమ్మకు నేను ఎందుకు ద్రోహం చేస్తాను, వాళ్లెవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు.ఒంటరిదాన్ని చేస్తున్నారు తట్టుకోలేకపోతున్నాను అమ్మ అని తులసితో అంటాడు అభి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!