ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...లీలావతి, మన పూజలూ, పురస్కారాలు వాళ్లకేం తెలుస్తాయి అని అనగా జానకి,నేర్చుకుంటే తెలుస్తుంది కదా పిన్ని గారు అందుకే పూజల కూర్చోబెట్టాము అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ పూజారిగారుతో పూజ కానివ్వండి అని అంటుంది. అప్పుడు పూజారిగారు జానకిని పాట పాడమని చెప్తారు. అప్పుడు జానకి పాట పాడుతూ ఉండగా ఇంతలో మల్లిక జెస్సీ తో నువ్వు కూడా పాడు జెస్సీ అత్తయ్య గారి ముందు నీకు మంచి పేరు వస్తుంది అని అనగా జెస్సి పాడుతుంది.