తల్లి చాటు బిడ్డిగా పెరిగిన మహేష్ బాబు, అమ్మతో ఎన్నో జ్ఞాపకాలు... ఇందిరాదేవితో సూపర్ స్టార్ రేర్ ఫోటోస్..

Published : Sep 28, 2022, 12:09 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృ మూర్తి ఇందిరాదేవి మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  ఇందిరా దేవికి ఐదుగురు సంతానం అయినా.. తల్లి చాటు బిడ్డగా పెరిగాడు సూపర్ స్టరా్ మహేష్ బాబు. ఆమ్మతో సూపర్ స్టార్ కు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలెన్నో.. 

PREV
18
తల్లి చాటు  బిడ్డిగా పెరిగిన మహేష్ బాబు, అమ్మతో ఎన్నో జ్ఞాపకాలు... ఇందిరాదేవితో సూపర్ స్టార్ రేర్ ఫోటోస్..

అలనాటి సూపర్ స్టార్ కృష్ణ - ఇందిరాదేవి కి ఐదుగురు సంతానం. అందులో రమేష్ బాబు, మంజుల, మహేష్ తో పాటు చిన్న అల్లుడు సుధీర్ బాబు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇక కృష్ణ రెండోవ పెళ్ళి తరువాత  పిల్లలను ఎంతో ఆప్యయంగా పెంచుకున్నారు ఇందిరా, ముఖ్యంగా మహేష్ బాబును ఆమె ఎంతో గారాబంగా పెంచారు. 

28

సూపర్ స్టార్ ఎక్కువగా తల్లి ఇందిరాదేవి దగ్గరే పెరిగాడు. ఇందిరాదేవి మాతృమూర్తి.. మహేష్ బాబు అమ్మమ్మ అంటే ఆయనకు ఎంతో ఇష్టం, తల్లీ అమ్మమ్మ ప్రేమతో పెరిగిన మహేష్ కు తన ,సోదరీ సోదరులకంటే.. ఎక్కువ అనుబంధం ఉంది. 
 

38

ఇందిరా దేవి ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదు. ఎక్కువగా ఫంక్షన్లలో కూడా కనిపించింది లేదు. సినిమా కార్యక్రమాలకు అయితే చాలా దూరంగా ఉండేవారు. బాగా దగ్గర  శుభకార్యాలలో మాత్రమే ఆమె కనిపించేవారు. తన పిల్లలతో కలిసి సందడి చేసేవారు. మహేష్ తో ఆమె ఫోటోలు చాలా ఉన్నా.. నెట్టింట్లో మాత్రం కొన్ని ఫోటోస్ మాత్రమే కనిపిస్తాయి. 
 

48

సూపర్ స్టార్ కృష్ణ ష‌ూటింగ్స్ లో ఎప్పుడూ కనిపించని ఇదిరా దేవి.. మహేష్ షూటింగ్స్ లో మాత్రం అప్పుడప్పుడు కనిపించేవారు. ఆయనతో    టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు ఇందిరా.  
 

58

మహేష్ బాబు కూడా అమ్మని చాలా ప్రేమగా చూసుకునేవారు. కుటంబ కార్యక్రమాలు ... శుభకార్యాలకు వెళ్ళినా.. తనతల్లి చేయి వదలకుండా.. వెన్నంటే ఉండేవాడు. ఆమెతో ముచ్చట్లు చెపుతూ..నవ్వుతూ నవ్విస్తూ.. ఉండేవాడు. 
 

68

ఎంత ఎదిగినా మహేష్ తల్లి కొంగు చాటు బిడ్డే.. అమ్మే నా దైవం అంటు ఆయన ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యారు. అమ్మ గురించి తన దగ్గరి సన్నిహితులతో మాత్రమే మాట్లాడేవారు మహేష్.. ఆమె లేకపోతే తాను లేను అని ఎన్నో సార్లు అన్నారు మహేష్. 

78

ఇందిరాదేవి కూడా తన పిల్లలు.. వారి కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపటానికి ఇష్టపడేవారు. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్లు, మనవళ్లు .. మనవరాళ్లు.. ఇలా అంతా ప్రేమగా పెద్దావిడ పుట్టినరోజు వేడుకలు చేసేవారు. 
 

88

ఇందిరా దేవి మరణం సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణతో పాటు మహేష్ బాబు ఇతరకుటుంబ సభ్యులు ధుఖంలో మునిగిపోయారు. మహేష్ కూడా తన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. చివరి రోజుల్లో అమ్మ వెంటే ఉన్నట్టు తెలుస్తోంది.  అన్న రమేష్ బాబు మరణించి ఏడాది గడవక ముందే.. అమ్మ మరణం మహేష్ బాబును తీవ్రంగా కలచివేస్తోంది. 

click me!

Recommended Stories