ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య,నందులు ప్లేన్ వెనకన మాట్లాడుకుంటూ ఉండగా ఎయిర్ హోస్ట్రెస్ దయచేసి సీట్లోకి వెళ్లి కూర్చోండి అని అంటుంది.అప్పుడు వాళ్ళు సీట్ దగ్గరకి వచ్చేస్తారు.మరోవైపు సామ్రాట్ తులసి తో, మీరు నాతో ఏమీ మాట్లాడొద్దు.మీరు మొదటిసారి ఫ్లైట్ ఎక్కడం కదా! ఈ క్షణాలను మీరు అనుభవించండి నాతో మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది అని అంటాడు. అప్పుడు తులసి, తమ గురించే కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే మగవాళ్ళని నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను అని అంటుంది.