Guppedantha manasu: సాక్షికి సూపర్ షాకిచ్చిన రిషీ.. వసుధారతో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్?

First Published Aug 15, 2022, 10:35 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసుధార పువ్వుల మాల పట్టుకొని కిందకు దిగుతుంది. అదే సమయంలో మరోవైపు మెట్ల నుంచి రిషి కూడా కిందకు దిగుతాడు.ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కిందకు దిగుతారు. ఆ సమయంలో వసుధార మెట్ల దగ్గర కాలుజారి పడిపోతున్నప్పుడు ఆ పువ్వుల మాల రిషి మెడలోని, వసుధార మెడలోని కలిపి పడుతుంది. ఆ తర్వాత సీన్ లో పూజ దగ్గర సాక్షి కూర్చుంటుంది.వసుధార అదే సమయంలో అక్కడికి వచ్చేసరికి సాక్షి వసుధార ని గర్వంతో ఒక చూపు చూస్తూ గతంలో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటుంది. రిషి నాకు దక్కడు అన్నావు ఇప్పుడు ఇక్కడ నేనే ఉన్నాను అని అనుకుంటుంది.
 

ఈ లోగ దేవయాని వసుధారని పిలిచి వెళ్లి సాక్షి ని ముస్తాబు చేయు అని అంటుంది. అప్పుడు ధరణి నేను వెళ్లి చేస్తాను అత్తయ్య గారు అని అనగా దేవయాని, నేను ఎవరికీ చెప్పాను వాళ్లే చేయండి అని అంటుంది. అప్పుడు వసుధార సాక్షిని పైకి తీసుకెళ్లి చీరలో ముస్తాబు చేస్తుంది. అప్పుడు సాక్షి గర్వంతో ఈ బట్టలలో నీ కన్నా నేనే బాగుంటాను కదా! అయినా ఎందుకు ఏదో కోల్పోయినట్టు ముఖం అలా పెట్టావు? ఓహో రిషి ని కోల్పోయావు కదా! ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాంలే, రిషిని దక్కించుకునే అదృష్టం నీకు లేదు.రిషి నావాడు అవుతున్నాడు. ఇంకొన్ని రోజులలో పెళ్లి కూడా అయిపోతుంది. నీకు దేవుడు కాస్తో  కూస్తో తెలివితేటలు ఇచ్చాడు కదా నీకన్నా పెద్ద స్థాయి వాడు ఎవడో ఒకడు దొరుకుతాడు లే అని అంటుంది.
 

ఈ లోగ జగతి అక్కడికి వచ్చి కిందకి పిలుస్తున్నారు అని సాక్షిని కిందకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత సీన్లో రిషి దేవుడికి దండం పెట్టుకుంటూ, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మాను అది తప్పు ఒప్పుకో తెలీదు కానీ మంచే జరగాలని కోరుకుంటాడు. ఈలోగా జగతి,చీరలో తయారైన వసుధారని తీసుకురావడం చూస్తాడు రిషి. కానీ అది బ్రమా అని తెలుస్తుంది చూసేసరికి అక్కడ సాక్షి ఉంటుంది. అప్పుడు జగతి ఇద్దరినీ దేవుడికి దండం పెట్టుకోమని చెప్తుంది.ఇద్దరు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మహేంద్ర, పూజారి గారు ఇద్దరినీ కిందకు పిలుస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు జగతి మీరు రిషిని తీసుకెళ్లండి మేము రెండు నిమిషాల్లో వస్తాము అని అంటుంది. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సాక్షి జగతితో, ఎంతైనా కన్నతల్లి కదా.
 

మీ కొడుకు నిశ్చితార్థం సమయం లో సంతోషంగా లేకపోయినా కనీసం సంతోషంగా ఉన్నట్టు  నటించొచ్చు కదా! మీరు ఎన్ని చెప్పినా ఆఖరికి రిషి నా వాడు అయ్యాడు. ఈ పెళ్లిని ఎలా ఆపాలని ఆలోచనలో ఉండుంటారు కదా మీరు? అని అంటుంది సాక్షి. అప్పుడు జగతి, నా కొడుకు గురించి నాకు తెలుసు. మీరు ఏం మాయమాటలు చెప్పినా కొడుకుని ఒప్పించారు తెలియదు కాని రిషి పెళ్లికి ఒప్పుకున్నాడు.కానీ ఒక విషయం గుర్తుంచుకో సాక్షి పెళ్లంటే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఒకే జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరి ఆలోచనలు వేరైనా, ఇద్దరు స్వభావాలు వేరైనా వారు చివరి వరకు ఉండేది కేవలం బంధం, ప్రేమ వళ్ళ మాత్రమే. రిషి నిన్ను ప్రేమించడం లేదని నీకు తెలుసు నాకు తెలుసు.
 

అయినా సరే బంధం చివరి వరకు ఉంటది అనుకుంటున్నావా? అని అంటుంది జగతి. రిషి నాకు ప్రేమని ఇవ్వలేకపోవచ్చు కానీ నేను రిషికి ప్రేమని ఇవ్వగలను కదా! అయినా మీరు చాలా కుళ్ళుకుంటున్నటున్నారు ఆంటీ అని అనగా నేనేమీ కుళ్ళిపోవడం లేదు అది నా స్వభావం కాదు.ఆ స్వభావం నీది నిన్ను నడిపించే వాళ్లది అని అంటుంది జగతి.రిషికి కన్నతల్లి కదా ఇప్పుడు వరకు గౌరవించి మీరు చెప్పింది అంతా విన్నాను మర్చిపోయాను కూడా అని అంటుంది. ఈ లోగ పంతులుగారు సాక్షిని కిందకి రమ్మంటారు. అప్పుడు జగతి సాక్షిని కిందకు తీసుకొని వస్తుంది. పంతులుగారు సాక్షిని రిషి పక్కన కూర్చోమంటారు. అప్పుడు రిషి పరధ్యానంలో కూర్చో వాసుధారా అని అంటాడు.
 

సాక్షి కోపంతో రగిలిపోతుంది అప్పుడు దేవయాని ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవి సాక్షి కూర్చొ అని అంటుంది. అప్పుడు పంతులుగారు ముందు మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి.తర్వాత లగ్నపత్రిక రాయపిస్తాను అని అంటారు.అప్పుడు దేవయాని నీ దగ్గర ఉంగరం ఉంది కదా రిషి అని చెప్పి సాక్షి కోసం స్వయంగా రిషి ఆర్డర్ పెట్టి చేయించిన ఉంగరం అది అని వసుధార ని చూస్తూ అంటుంది దేవయాని. అప్పుడు రిషి ఆ ఉంగరం తీస్తాడు. పంతులుగారు, ముందు రిషిని ఉంగరం పెట్టమంటారు.జగతి మహీంద్రా తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు కిందకు దించుకుంటారు. 
 

సాక్షి ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. అదే సమయంలో వసుధారని గర్వంతో చూస్తూ ఉంటుంది.ఈలోగా రిషి ఆ ఉంగరం సాక్షికి పెట్టబోతుండగా సాక్షి ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది. ఏమైంది సాక్షి? అని దేవి అని అడగగా పైకి లెగిసి ఉంగరాన్ని తీసి నా పేరులో మొదటి అక్షరంతో ఉంగరం చేయించమంటే  ఈ ఉంగరంలో V  అని రాసి ఉంది ఆంటీ చూడండి అని గట్టిగా అరుస్తుంది.అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!