Sreeleela: రెడ్ డ్రెస్ లో పెళ్లి సందD హీరోయిన్.. ఇంత సొగసు ఎలా, రోజూ కొంచెం అందం తింటోందేమో

First Published Aug 15, 2022, 11:21 AM IST

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు.

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. ఒక్క హిట్ పడితే శ్రీలీల టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. 

'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల 'ధమాకా' చిత్రంలో రవితేజ సరసన నటిస్తోంది. అలాగే నితిన్, వక్కంత వంశీ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది ఈ యంగ్ బ్యూటీ.  

పెళ్లి సందD చిత్రంలో రాఘవేంద్ర రావు ఈ యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు రాఘవేంద్ర రావు సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ' పండుగాడ్'. ఆగష్టు 19న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి శ్రీలీల అతిథిగా హాజరైంది. 

రెడ్ డ్రెస్ లో శ్రీలీల మైండ్ బ్లోయింగ్ గ్లామర్ తో ఆకట్టుకుంది. చిరునవ్వులు చిందిస్తూ అందరిని ఆకర్షించింది ఈ బ్యూటీ. తనకి హీరోయిన్ గా తొలి ఆఫర్ ఇచ్చిన రాఘవేంద్ర రావుగారికి కృతజ్ఞతగా శ్రీలీల పండుగాడ్ ప్రీ రిలీజ్ కి హాజరైంది. 

చిరునవ్వులు చిందిస్తూ క్యూట్ గ్లామర్ తో ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీలీల హైలైట్ అయింది. శ్రీలీల రోజూ అన్నంతో పాటు అందం కూడా తింటోందా అనేంతగా ఈ బ్యూటీ గ్లామర్ తో వెలిగిపోతోంది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రసంగంతో శ్రీ లీల ఆకట్టుకుంది. 

పెళ్లి సందD తర్వాత రాఘవేంద్ర రావు గారితో కలసి ఈవెంట్ లో పాల్గొనడం ఇదే తొలిసారి అని, చాలా సంతోషంగా ఉందని శ్రీలీల తెలిపింది. రాఘవేంద్ర రావు గారు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. 

ఆ క్రమంలో వచ్చిన మరో చిత్రమే పండుగాడ్. టీజర్స్, ట్రైలర్స్ చాలా ఫన్నీగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయని శ్రీలీల తెలిపింది. 

ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, సునీల్, దీపికా పిల్లి, అనసూయ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకుడు.

దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ సంతోషంగా ఉందని రాఘవేంద్ర రావు అన్నారు. తెలుగు సినిమాకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అని అన్నారు. 

ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 అద్భుత విజయం సాధించాయి అని రాఘవేంద్ర రావు ప్రశంసించారు. ఆగష్టు 19న పండుగాడ్ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి కూడా అలంటి ఆదరణే చూపించాలి అని రాఘవేంద్ర రావు కోరారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెళ్లి సందD హీరో రోషన్ కూడాఅతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అతిథిగా హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు అని హరీష్ అన్నారు. 

రాఘవేంద్ర రావు గారికి పళ్లే దేవుళ్ళు..అందుకే పండుగాడ్ అని టైటిల్ పెట్టారు అంటూ చమత్కరించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాఘవేంద్ర రావు దూసుకుపోతున్నారని ప్రశంసించారు. 

click me!