ఈరోజు ఎపిసోడ్లో నందు అభి ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరవడంతో వాయిస్ లో బేస్ మారింది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు అభి, అంకిత. మరొకవైపు పరంధామయ్య అన్నను ఇక ఒంటరిగా వదిలేసి వెళ్ళిపో అనసూయ కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను నన్ను ఒంటరిగా బతకనివ్వు ఒంటరిగా చావనివ్వు అనడంతో అనసూయ పందామయ్యా వైపు చూస్తూ ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే అభి, లాస్యకి డాడ్ వచ్చారు ఆంటీ అని మెసేజ్ చేయడంతో లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం నందు కి ఎలా చెప్పాలి అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి అందమయిన జాగ్రత్తగా చూసుకోండి నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను అసూయతో పాటు వెళ్తుంది.