మరొకవైపు వసుధార, రిషి జగతి వాళ్ళు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వసుధార ఏం కాదు సార్ జగతి మేడం వాళ్ళు వస్తారు అని రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ ఫోన్ చేసి తీసి ఒకసారి హాస్పిటల్ కి రారా నీతో కొంచెం పని ఉంది అనడంతో నేను రాలేను గౌతం నేను డాడ్ వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాను అనడంతో ప్లీజ్ రా నాకోసం ఇదొక్కసారి ఇక్కడికి రారా నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి కట్ చేస్తాడు. అప్పుడు ఏంటి వసుధార ఇది అనడంతో సార్ గౌతమ్ సార్ కి ఎంత ఇబ్బంది ఉంటే అన్ని సార్లు కాల్ చేసి ఉంటారో వెళ్దాం పదండి సార్ అని రిషి ని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్తుంది వసుధార.