Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి తిక్క కుదిర్చిన దివ్య.. వేట మొదలెడతానంటున్న తులసి!

First Published May 30, 2023, 10:30 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. సమస్యల్లో ఇరుక్కున్న మాజీ భర్త కోసం పోరాడుతున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసినప్పుడు కూడా నిన్ను చాలాసార్లు ఏడిపించాను. అయినా నువ్వు నాకు మంచే చేశావు. నా కాపురాన్ని రోడ్డు మీద పడకుండా చేశావు ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి అంటుంది భాగ్య. ద్వేషం పశ్చాత్తాపంతో తడిస్తే వచ్చే ప్రేమ చాలా  బాగుంటుంది. ఇప్పుడు నీ ప్రేమ అలాగే అనిపిస్తుంది.
 

అప్పుడప్పుడు ఇంటికి వస్తూపోతూ ఉండు అంటుంది తులసి. ఇంతకీ నేను ఫోన్ చేసిన విషయం చెప్పటం మర్చిపోయాను నువ్వు నాకు చేసిన సాయానికి కృతజ్ఞతగా లాస్య ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేశాను. ఇప్పుడు కోర్టులో తనకి  బలమైన సాక్ష్యం లేదు అంటుంది భాగ్య. నువ్వు చేసిన సాయం చాలా గొప్పది అంటూ ఆనందంతో ఫోన్ పెట్టేస్తుంది తులసి. మరోవైపు మీ ఆవిడని మసాజ్ చేయవద్దు అని చెప్పు మా అక్క కాళ్ళు నొప్పితో పోయేలాగా ఉంది అని విక్రమ్ తో  అంటాడు బసవయ్య.

ఆయనే కాదు దేవుడు చెప్పిన వినను ఈరోజు ఎలాగైనా అత్తయ్య చేత నడిపిస్తాను అన్నాను నడిపించి తీరుతాను కాకపోతే కొంచెం నొప్పి భరించాలి అంటుంది దివ్య. ఇప్పటికిప్పుడు అమ్మ నడుస్తుందంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది అంటాడు విక్రమ్. అయితే అందరూ వెళ్లి హాల్లో కూర్చోండి. అత్తయ్యని నడిపించుకుని తీసుకువస్తాను అంటుంది దివ్య. అందరూ వెళ్ళిపోయిన ఏ నరం నొక్కితే కాలు పడిపోతుందో నాకు బాగా తెలుసు.
 

 మర్యాదగా నడుస్తావా లేకపోతే నరం నొక్కమంటావా అంటూ కాలిని గట్టిగా నొక్కుతుంది దివ్య. నా కొడుకు నా చేతిలో ఉన్నాడు అని గొప్పలు పోయావు ఇప్పుడు అదే కొడుకు నిన్ను నాకు అప్పజెప్పి కిందకి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఏం చేసినా అడిగే దిక్కులేదు కావాలంటే చూస్తావా అని అడుగుతుంది దివ్య. మరీ రెచ్చిపోకు ఈసారి నువ్వు గెలవచ్చు కానీ నా టైం వచ్చినప్పుడు నా సంగతి చూపిస్తాను అంటుంది రాజ్యలక్ష్మి.
 

 ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ సంగతి చెప్పు మర్యాదగా నడుచుకొని కిందికి వస్తావా లేకపోతే కాలుని ఓ పట్టు పట్టమంటావా అంటూ కాలుని గట్టిగా నొక్కుతుంది దివ్య. తప్పనిసరి పరిస్థితుల్లో దివ్యతో పాటు కిందికి వస్తుంది రాజ్యలక్ష్మి. తల్లిని అలా చూసి ఆనందం పట్టలేక పోతాడు విక్రమ్. ఇప్పుడు అంతా బానే ఉంది కదమ్మా అని తల్లిని అడుగుతాడు. తప్పదన్నట్లుగా బానే ఉంది అంటుంది రాజ్యలక్ష్మి. ఆనందంతో దివ్య ఎత్తుకొని తిప్పుతాడు విక్రమ్.
 

 సీన్ కట్ చేస్తే దిగులుగా కూర్చున్న అత్తమామలకి దేవుని హారతి ఇస్తూ ఎందుకు అంత దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది తులసి. తెలిసే అడుగుతున్నావా అంటారు పరంధామయ్య దంపతులు. మనం పోరాటం చేస్తున్నాను ముందే ఓటమి గురించి ఆలోచించడం ఎందుకు. చచ్చిన శవం కూడా ఒక్కొక్కసారి లేచి కూర్చుంటుంది. మన కేసు కూడా అలాగే అవ్వచ్చేమో నిరాశ పడొద్దు అంటుంది. భర్త దగ్గరికి వెళ్లి హారతిస్తుంది తులసి.

నందు తో పాటు లాస్య కూడా హారతి కళ్ళకు అద్దుకుంటుంది. అక్కడ సడన్ గా లాస్యను చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకు వచ్చావు అంటూ గట్టిగా మాట్లాడుతారు. బుద్ధిగా ఉండొచ్చు కదా నందు ఎందుకు అలా రెచ్చిపోతావు. కేఫ్అ లో అలా రెచ్చిపోయే కదా దొరికిపోయావు అంటుంది లాస్య. అయినా నేను వచ్చింది కారు కోసం ఎలాగో నందు కి శిక్ష పడుతుంది వారసత్వంగా ఆ కారు నాకే కదా రావాలి అందుకే ఇక్కడ నుంచి కోటికి అందరూ కలిసి వెళ్దాము.
 

 అటు నుంచి అటు నేను కార్లో వెళ్ళిపోతాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడే తీర్పు నువ్వే చెప్పేస్తున్నావా.. ఎవరికి తెలుసు ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందో మరి అంత మిడిసి పడకు అని లాస్యకి చీవాట్లు పెడుతుంది తులసి. సరే అయితే అక్కడే చూసుకుందాం అంటూ వెళ్ళిపోతుంది లాస్య. నందు వాళ్లు కూడా కోర్టుకి బయలుదేరుతారు. మరోవైపు మా అమ్మకి కాలు నయం చేసినందుకు అంటూ దివ్యకి ఒక రెడ్ రోజ్ ఇస్తాడు విక్రమ్.

నువ్వు నా మీద ప్రేమతో కాకుండా మీ అమ్మ మీద ప్రేమతో ఇచ్చావన్నమాట అంటూ పువ్వుని విక్రమ్ చేతిలో పెడుతుంది దివ్య. రెండింటికి తేడా ఏంటో అర్థం కాలేదు అంటాడు విక్రమ్. తరువాయి భాగంలో తులసి నేను ఆటలో దిగిలేనంతవరకే ఆటలో దిగానంటే వేటే. మళ్లీ కేసుని తిరగతోడుతాను నీ కుతంత్రాలన్నీ బయటికి లాగుతాను అంటూ లాస్యతో ఛాలెంజ్ చేస్తుంది తులసి.

click me!