ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ చెప్పకుండా బాధను తెలుసుకునే వాళ్ళని ఫ్రెండ్ అంటారు అనడంతో, వెంటనే తులసి సహాయం పొందడమే తప్ప రుణం తీర్చుకొని వారిని ఏమంటారు అనగా ఫ్రెండ్షిప్ లో రుణాలు తీర్చుకోవడం లాంటివి ఉండవండి అని అంటాడు. ఎందుకండీ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేనేమైనా రాజ్యాలు రాసిచ్చానా ఒక మాట సహాయం చేశాను మీ అమ్మగారిని మీ దగ్గరికి పంపించాను అంతే అని అంటాడు. సరే నేను ఉంటాను మీ అమ్మ గారితో మాట్లాడండి అని ఫోన్ కట్ చేస్తాడు.