మనం వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లాలి కదా అనగా వెంటనే ఫణీంద్ర ఉన్నఫలంగా వెళ్ళాలి అంటే కష్టం కదా దేవయాని అని అంటాడు. అప్పుడు ఉన్నపలంగా ఏంటండీ పంతులుగారికి ఫోన్ చేసి ముహూర్తం చూడమని చెప్పాను అని అంటుంది. వీళ్ళిద్దరి కంటే ఎలాగో పట్టదు కనీసం నేనైనా ముందుండి ఇలాంటివన్నీ చేయించాలి కదా అని అంటుంది. ఇలాంటి విషయాల్లో తొందర పడాలి లేకపోతే పనులు జరగవు అని అంటుంది. మరొకవైపు రిషి ఏ షర్టు వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అందులో కొన్ని ఫొటోస్ తీసి వసుధారకి సెండ్ చేస్తాడు. మరోవైపు ధరణి వసుధర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషి, వసు కి మెసేజ్ చేస్తాడు.