Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో చవితి వేడుకలు.. తులసి, సామ్రాట్ లను చూసి కుళ్ళిపోతున్న నందు లాస్య!

First Published Sep 12, 2022, 10:16 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తులసి,నందు లస్యలనీ, సతి సమేతంగా వచ్చారు కదా పూజ అయ్యేవరకు ఉండండి అని అంటుంది. అప్పుడు లాస్య హనీతో, మీ డాడీ రాలేదా అని అడగగా ఏదో మీటింగ్ ఉన్నదని కారులోనే ఉండిపోయారు అని అంటుంది హనీ. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు తులసి ఇంటి బయటకు వెళ్తుంది. నేను పార్ట్నర్షిప్ వొదుకుకున్నను అని నాతో మాట్లాడడం మానేశారు ఇప్పుడు నేను మాట్లాడితే బాగుంటదా అని తులసి అనుకుంటుంది. నేను తిరిగి ఫోన్ కూడా చేయలేదు అసలు విషయం కూడా కనుక్కోలేదు.
 

ఇప్పుడు నేను వెళ్లి మాట్లాడితే బాగుంటుందని సామ్రాట్ అనుకుంటాడు. ఇద్దరు ఎవరు ముందు మాట్లాడదాం అని అనుకుంటారు. మరోవైపు లాస్య నందు తో, సామ్రాట్ కోపం మామూలుది కాదు అస్సలు కరగడు లోపలికి రాడు అని అంటుంది. ఇంతలో తులసి సామ్రాట్ లు ఇద్దరు ఒకేసారి మాట్లాడుతారు. నన్ను క్షమించండి హనీ తో పాటు మిమ్మల్ని కూడా పూజకు పిలవాల్సింది అని తులసి అనగా, హనీతోపాటు నన్ను పిలవాల్సిందా? నాతో పాటు హనీని పిలవాల్సిందే అయినా దానికోసం క్షమాపణ చెప్పడం ఎందుకులెండి మెసేజ్ పెట్టిన సరిపోతుంది కదా..
 

ఎన్ని మెసేజ్లు పెట్టుకున్న డైరెక్ట్ గా వచ్చి మాట్లాడటం కన్నా మేలు ఇంకేం ఉండదు కదా అయినా నేను మీకు ఏమవుతానని? మీ బాస్ ని కాదు ఎందుకంటే మీరు నాకు కింద పని చేయట్లేదు, మీ వ్యాపార భాగస్వామిని కాదు, ఎందుకంటే మీరు బిజినెస్ నుంచి తప్పుకున్నారు, మీ ఫ్రెండ్ ని కాదు ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు మరి నేను ఎందుకు రావాలి అని అనగా మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉన్నారు అని అంటుంది తులసి.అలా లేదు లెండి నేను సరదాగా అన్నాను అని అంటాడు సామ్రాట్.
 

అప్పుడు తులసి, పూజ అవుతుంది లోపలికి రండి తర్వాత మాట్లాడుకుందాం అని అనగా సామ్రాట్, పదండి అని అంటాడు. మీరు మొఖం ఎందుకు అలా పెట్టుకున్నారు మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్తున్నానా కొంచెం నవ్వండి అని అంటుంది తులసి.అప్పుడు సామ్రాట్ నవ్వుతాడు దాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఆనంద పడతారు. వాళ్ళిద్దర్నీ చూస్తూ నందు,లాస్య లు చిరాకు పడతారు.ఇంతలో నందు,లాస్య లు సామ్రాట్ దగ్గరకు వెళ్లి కారులోనే కూర్చున్నారట సార్,చూడలేదు సారీ అని అనగా నాకు అదే మంచిదైంది లెండి అని సామ్రాట్ అంటాడు.
 

అప్పుడు అభి, మీరు మా అమ్మని తప్పు చేశాను అని తిట్టారు మీరు సారీ చెప్తే గాని పూజ చేయడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. దానికి తులసి, ఈ సమస్య నాకు ఆయనకి మధ్యలో మీరు ఎవరు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు సమస్య తీరిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళండి ఇంకెవరు ఇందులో తలదొచాల్సిన అవసరం లేదు అని  తిడుతుంది. అప్పుడు హనీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అందరూ అలాగున్నారు? నాన్న నువ్వు నిజంగా బయట మీటింగ్ కోసమే ఉన్నావా అని అనగా అవునమ్మా ఇంక వెళ్ళనులే పూజ అయ్యేవరకు ఇక్కడే ఉంటాను అని సామ్రాట్ అంటాడు.
 

అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పూజ మొదలుపెడతారు. పంతులుగారు అందరికీ తాయత్తులు ఇస్తారు. అప్పుడు భార్య భర్తలు ఇద్దరూ ఒకరికొకరు తాయెత్తులు కట్టుకుంటారు. అప్పుడు తులసి హనీ దగ్గరికి వెళ్లి ఆ తాయత్తుని సామ్రాట్ కి కట్టమంటుంది, హనీ ఆ తాయత్తును సామ్రాట్ కడుతుంది.అలాగే నందు లాస్యలు, అభి అంకితలు, పరంధామయ్య అనసూయలు, శృతి ప్రేమ్ లు  కూడా తాయత్తు కట్టుకుంటారు. అప్పుడు అందరు తులసి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. పూజా కార్యక్రమం అంతా అయిపోతుంది.
 

తర్వాత అభి, నందు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తాడు. ఇష్టం లేకపోయినా తులసి చెప్పినందుకు అంకిత కూడా వెళ్తుంది. అప్పుడు అభి, ప్రేమ్ నీ వెళ్ళమంటాడు. నేను ఇష్టం లేకుండా ఇంకొకరు దగ్గర ఆశీర్వాదాలు తీసుకోను, నాకు అనిపిస్తేనే తీసుకుంటాను. మనస్ఫూర్తిగా చేయలేని పని నాకు వద్దు అని అంటాడు. అప్పుడు సామ్రాట్, మీ అమ్మగారే గౌరవిస్తున్నప్పుడు నువ్వెందుకు గౌరవం ఇవ్వడం లేదు అని అంటాడు. మీ కుటుంబ విషయంలో తల దూర్చుతున్న అని తప్పుగా అనుకోవద్దు అని అంటాడు.
 

దానికి ప్రేమ్ కొన్ని మంది పుణ్యమా అని మా కుటుంబ విషయం ఎప్పుడో పబ్లిక్ లో పడిపోయిందిలెండి సామ్రాట్ గారు పర్లేదు అని అభితో చూస్తూ అంటాడు ప్రేమ్. అప్పుడు నందు మనసులో, అయినా తులసి నా మాట వినడం ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు పరంధామయ్య లక్కీ తో వినాయకుడు ముందు గుంజీలు తీస్తే చదువు వస్తుంది,వెళ్లి తియ్యు అనగా లక్కీ, మీరు కూడా గుంజులు తీయండి తాతయ్య కొంచెం ఒంట్లో బరువు తగ్గుతాది అని అంటాడు.దానికి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!