
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసుధార, ఈ ఆలోచన దేవయాని మేడం దే అని జగతి మహేంద్రలకు చెప్తుంది. అప్పుడు జగతి, మహేంద్ర లో ఆశ్చర్యపోతారు. మహేంద్ర, దేవయాని వదిన ఇంత పని చేసారు అంటే నాకు నమ్మబుద్ధి వేయట్లేదు అని అంటాడు. ఇంతలో జగతి మనసులో, నాకు ఏదో అనుమానంగా ఉన్నది సాక్షి విషయం జరిగినప్పుడు నుంచి అక్కయ్య మౌనంగా ఉండి పోయారు.ఏ రియాక్షన్ లేదు అంటే ఏదో పెద్దదే ప్లాన్ చేశారు అని అనుకుంటుంది. ఇంతలో వసు కళ్ళు మూసుకుంటుంది.ఏం చేస్తున్నావ్ అని జగతి అడగగా, రిషి సార్ వస్తున్నారు మేడం అని అంటుంది. నీకెలా తెలుసు హార్న్ కూడా వినిపించలేదు కదా అని జగతి అనగా, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది మేడం అని అంటుంది వసు. కానీ వెనక్కి చూస్తే రిషి కనిపించడు.
ఇంతలో జగతి, సరే పర్మిషన్ తీసుకో ఇంటికి వెళ్దాము అని అంటాది. దానికి వసు, లేదు మేడం. పనున్నది అని అంటుంది. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు.జగతి, మహీంద్రలు ఆశ్చర్యపోతారు. భలే చెప్పేసావే వసుధారా అని మహేంద్ర అంటాడు.అంతలో రిషి వచ్చిన వెంటనే జగతి మహీంద్రలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను రాగానే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని రిషి అడగగా ఏమీ లేదు మేము వచ్చాము,కాఫీ తాగాము, వెళ్ళిపోయే సమయంలో వచ్చావు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్తున్నప్పుడు, వాళ్ళిద్దర్నీ ఒంటరిగా వదిలేయడమే మంచిది మధ్యలో జోక్యం చేసుకోవడం ఎందుకు అని అనుకుంటారు. అప్పుడు రిషి అక్కడికి వచ్చి పర్మిషన్ పెట్టి రా బయటికి వెళ్ళాలి అని అంటాడు. ఇప్పుడు పర్మిషన్ దేనికి సార్ అని వసు అడగగా, చెప్పింది చేయ వసుధార,మేనేజర్ తో మాట్లాడాలా లేకపోతే పర్మిషన్ తీసుకుంటావా అని అంటాడు.
అప్పుడు వసు మనసులో ,ఈయనకి ఆర్డర్ వేయడం తప్ప పక్క వాళ్ళ అభిప్రాయంతో పనిలేదు అని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో గౌతమ్ హాల్లో కూర్చుని అనివర్సరీ కి కావాల్సిన వస్తువులు కి లెక్క వేస్తాడు. దేవయాని మాత్రం మొఖం మార్చేస్తూ ఉంటుంది. అంతలో రిషి కార్ అక్కడ ఆగుతుంది వసు,రిషి లు అందులో దిగుతారు. అప్పుడు దేవయాని మనసులో ఇప్పుడు వసుధార ఇక్కడకొచ్చింది నా విల్లు మండిపోతుంది కానీ బయటకు మాత్రం నవ్వుతూ ఉండాలి అని అనుకుంటుంది. అప్పుడు రిషి,వసు నీ లోపలికి తీసుకొని వచ్చి పనులన్నీ వసు వదిన మాత్రమే చేయలేరు కదా అందుకే వసుధార నీ కూడా తోడుగా తీసుకొని వచ్చాను, పనిలో సహాయం చేస్తుంది అని అంటాడు రిషి. దానికి దేవయాని నవ్వుతూ అవును రిషి కూడా మన మనిషే కదా అన్నీ కలిసి చేసుకుందాము అని అంటుంది.
ఇంతలో జగతి ,అక్కయ్య మనసులో ఏదో పెట్టుకుని బయటికి ఏదో మాట్లాడుతున్నారు దాని ఆలోచనలకి మాటలకి ఎటువంటి సంబంధం లేదు ఏదో జరుగుతుంది. దీని గురించి మహేంద్ర తో చెప్పి ఆలోచించాలి అని అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర కూడా, వదినగారు ఏదో చేయబోతున్నారు అందుకే ఇలా నటిస్తున్నారు అని అనుకుంటాడు.అప్పుడు జగతి ,వసు నీ లోపలికి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత సీన్లో గౌతమ్ ఫంక్షన్ కి కావాల్సిన వస్తువుల గురించి లెక్క వేస్తాడు.అంతలో మహేంద్ర జగతి వస్తున్నారు అక్కడికి వస్తారు. అప్పుడు మహేంద్ర, తను రమ్మంటే ఇంటికి రాలేదు గాని రిషి పిలిస్తే వచ్చింది అని వసుధారతో ఆట ఆడుకుంటాడు. జగతి కూడా మహేంద్ర వైపు వెళ్ళిపోతుంది. అయినా మేం పిలిస్తే ఎందుకు వస్తారులెండి మీరు పీలవల్సిన వాళ్ళు పిలిచినప్పుడే వస్తారు వర్షం అన్నివేళలా పడదు కదా అని ఆటపట్టిస్తారు.
ఆ తర్వాత సీన్లో అందరూ భోజనం చేస్తారు. వసు రిషి పక్కన కూర్చుంటుంది రిషి,వసుకి అన్నం, పప్పు వడ్డిస్తాడు దాన్ని చూసి దేవాయాని రగిలిపోతుంది. గౌతమ్ మహేంద్రలు వాళ్ళిద్దరూ అనుమానం తో చూస్తారు. ఇంతలో పనులు ఎంతవరకు వచ్చాయి అని ధరణిని దేవయాని అడగగా అవుతున్నాయి అని అంటుంది ధరణి. అప్పుడు రిషి ధరణితో మీరు ఒకరు చేయొద్దు వదిన అందరం తలో పని వేసుకొని చేద్దాము అప్పుడు పని త్వరగా అవుతుంది అని అనగా సరే అందరం కలిసి చేద్దామని అంటుంది ధరణి. అప్పుడు దేవయాని నేను కూడా చేయాలా చేస్తాను లెండి అని అనగా ధరణి వద్దు అత్తయ్య గారు మీకెందుకు శ్రమ అని అంటుంది. అప్పుడు దేవయాని చేస్తానులే ఖాళీగానే ఉన్నాను కదా అని అనగా మహేంద్ర,మీది ఎంత విశాలమైన హృదయం వదిన గారు మీలాంటి మంచి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు.పక్కవాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలని కోరుకునే స్వభావం మీది అని వెటకారిస్తాడ.
అది దేవయానికి అర్థమయ్యి ఇంక ఆపండి భోజనం చేద్దామని అనగా రిషి కూడా దేవయానిని పొగుడుతాడు. అప్పుడు దేవయాని మాటలు విన్న ధరణి, అత్తయ్య గారు ఏదో చేయబోతున్నారు అని ఆలోచిస్తుంది. అప్పుడు దేవయాని ధరణి వైపు చూస్తూ అనవసరమైన విషయాలు ఆలోచించొద్దు, మంచిది కాదు వెళ్లి పనులు చేసుకుని అంటుంది. అప్పుడు రిషి వసుధారతో పరీక్షలు అయ్యాయి కదా చాలా కష్టపడ్డావు. ఏం తిన్నావు ఏమో సరిగ్గా తిను అని అంటాడు.దేవయాని చాలా చిరాకు పడుతూ నవ్వుతుంది. ఆ తర్వాత సీన్లో జగతి, వసు గౌతమ్ ధరణి, పూలను కుడుతూ ఉంటారు. అంతలో ధరణి,నీకు అన్ని పనులు వచ్చు కదా వసు అని అనగా అవును మేడం నేర్చుకుంటే ఏ పనైనా వస్తాది అని అనుకుంటారు.
ఇంతలో మహేంద్ర,రిషి లు కిందకు దిగుతారు. అప్పుడు పూలను కడుతున్న వసునీ చూసి రిషి అలా చూస్తూ ఉండిపోతాడు. అంతలో మహేంద్ర జగతితో,మేము ఏమైనా సహాయం చేయాలా అని అడగగా మీరు ఇందులో తలదొర్చకుండా ఉంటే చాలు అని అంటుంది జగతి. దానికి మహేంద్ర, మగవాళ్ళు ఏ రంగంలోని తక్కువ కాదు. ఇది మాకు ఒక లెక్క అని అనగా కొంపతీసి మనల్ని ఇది చేయమంటారా డి అని అనగా కొంపతీసి ఏం కాదు కొంప ఉంచుకొని చేద్దాం పద రిషి అని అంటాడు మహేంద్ర.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!