NTR30: ఎన్టీఆర్‌-కొరటాల సినిమా షూటింగ్‌పై షాకింగ్‌ రూమర్.. ఫ్యాన్స్ కిది పరీక్షా కాలమే?

Published : Sep 12, 2022, 09:32 AM IST

ఎన్టీఆర్‌-కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం, హీరోయిన్‌ ఎవరు, బడ్జెట్‌ ఎంత అనేదానికి సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
15
NTR30: ఎన్టీఆర్‌-కొరటాల సినిమా షూటింగ్‌పై షాకింగ్‌ రూమర్.. ఫ్యాన్స్ కిది పరీక్షా కాలమే?

ఎన్టీఆర్‌(NTR) నటించిన `ఆర్‌ఆర్‌ఆర్`(RRR) విడుదలై దాదాపు ఆరు నెలలవుతుంది. ఇంకా కొత్త సినిమా ప్రారంభం కాలేదు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో చేయాల్సిన `ఎన్టీఆర్‌ 30`(NTR30) సినిమా షూటింగ్‌ ఎప్పుడు జరుగుతుందనేది పెద్ద సస్పెన్స్ నెలకొంది. దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. `వస్తున్నా` అంటూ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్ లీకులిస్తూ షూటింగ్‌ ఎప్పుడో అనేది క్లారిటీ లేదు. మరోవైపు హీరోయిన్‌ ఎవరనేదానిపై కూడా స్పష్టత రావడం లేదు. ఇంకా హీరోయిన్‌ కన్ఫమ్‌ కాకపోవడం ఆశ్చర్య పరుస్తుంది. 
 

25

ఇదిలా ఉంటే `ఎన్టీఆర్‌30` షూటింగ్‌ ఆగస్ట్ లోనే ప్రారంభమవుతుందన్నారు. సెప్టెంబర్‌ మిడిల్‌కి వచ్చింది. ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అక్టోబర్‌లో ఉంటుందనే రూమర్స్ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో పక్కా అంటూ అభిమానులు ట్విట్లు చేస్తున్నారు. కానీ ఇందులోనే మరో షాకిచ్చే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా అక్టోబర్‌ లో కాదు నవంబర్‌లో ప్రారంభమవుతుందంటున్నారు. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌ సహనానికి పరీక్షా కాలమనే చెప్పాలి. ఇప్పటికే కక్కలేక మింగలేకున్న తారక్‌ అభిమానులకు ఇది షాకిచ్చే వార్తే అని చెప్పాలి.

35

ప్రస్తుతం ఎన్టీఆర్‌ సన్నగా అయ్యేందుకు వర్కౌట్స్ చేస్తున్నారట. దానికి ఇంకా టైమ్‌ పడుతుందని, ఆ లోపు దర్శకుడు కొరటాల స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్‌ చేసి బౌండెడ్‌ స్క్రిప్ట్ ని రెడీ చేయాలని భావిస్తున్నారట. అదే సమయంలో హీరోయిన్‌ని కూడా కన్ఫమ్‌ చేయాలనుకుంటున్నారట. తాజాగా ఎన్టీఆర్‌ బయటకొచ్చారు. ఇటీవల `బ్రహ్మాస్త్ర` ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు తారక్‌. అందులో కాస్త బరువు తగ్గినట్టు కనిపించారు. ఇంకాస్త వర్కౌట్‌ చేయాల్సి ఉందని సమాచారం. 

45

ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. చాలా మంది హీరోయిన్ల పేరు వినిపించాయి. సమంత నుంచి జాన్వీ కపూర్‌ వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఏదీ ఫైనల్‌ కాలేదు. లేటెస్ట్ గా రష్మిక మందన్నా(Rashmika Mandanna) పేరు వినిపిస్తుంది. ఆమెని అప్రోచ్‌ అయ్యారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. రష్మిక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీలో పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ రష్మికనే ఫైనల్‌ అయితే ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పొచ్చు. 

55

ఇదిలా ఉంటే ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుందని, మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారని సమాచారం. యాక్షన్‌ పాళ్లు రెట్టింపుగా ఉంటాయని, కనీవినీ ఎరుగని రీతిలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటాయని అంటున్నారు. వెయిటింగ్‌ కి తగ్గ రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏకంగా 250కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో భారీగా `ఎన్టీఆర్‌ 30`ని తెరకెక్కించేందుకు కొరటాల ప్లాన్‌ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories