ఆ తర్వాత సీన్లో సామ్రాట్ హనీతో ఆడుకుంటూ ఉండగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఫోన్లో ఒక ఆర్టికల్ని చూపిస్తారు. అక్కడ "బిజినెస్ మాన్ సామ్రాట్ వైజాగ్ లో ప్రేయసితో ప్రేమలు" అని ఉంటుంది. అప్పుడు సామ్రాట్ కోపంతో ఇలా ఇష్టం వచ్చిందంతా రాసిస్తారా. మేము వెళ్ళాము కానీ నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ విషయం తులసి వాళ్ళ ఇంట్లో తెలిస్తే మీడియాలో ఇదంతా హల్చల్ అవుతుంది. తులసి ఇంట్లో సంగీతానికి ఒప్పుకోరు అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో అభి ఆ ఫోటోలను ఇంటిలో అందరికీ చూపిస్తూ, అసలు ఈ ఫోటోలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అనగా, ప్రేమ్, నీకు అమ్మ మీద నమ్మకం ఉందా లేదా.