యూఎస్ఏలో తెలుగు సినిమాల జోరు.. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలివే.. టాప్ లో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’..

First Published Aug 23, 2022, 12:54 PM IST

యూఎస్ఏ (USA) బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాలు ఏకంగా మిలియన్ల డాలర్స్ ను కలెక్ట్ చేశాయి. ఈ లిస్ట్ లో ‘ఆర్ఆర్ఆర్’ టాప్ లో నిలవడం విశేషం. మిగిలిన చిత్రాలు ఒక్కొక్కటి ఎంత వసూలు చేశాయంటే..
 

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తెలుగు సినిమా సత్తాను చాటింది. తెలుగు స్టేట్స్ తో పాటు నార్త్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అటు యూఎస్ఏలోనూ చిత్రం అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. 2022లో మార్చిలో విడుదలైన ఈ చిత్రం యూఎస్ఏలో హ్యయేస్ట్ గ్రాసింగ్ తెలుగులో ఫిల్మ్ లో ‘ఆర్ఆర్ఆర్’టాప్ వన్ లో నిలిచింది. ఈ ఏకంగా 14.33 మిలియన్ల డాలర్స్ ను వసూల్ చేసి.. అన్ బ్రేకబుల్ రికార్డును క్రియేట్ చేసింది. చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన తెలుగు చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ఒకటి. మలయాళ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’కు రీమేక్ గా వచ్చింది. తెలుగుతో స్టేట్స్ తో పాటు యూనైటెడ్ స్టేట్స్ లోనూ ఈ చిత్రం సూపర్ రెస్సాన్స్ ను సొంతం చేసుకుంది. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 2.43 మిలియన్ల డాలర్స్ ను కలెక్ట్ చేసింది. రీమేక్ లోనూ ఇంతటి వసూళ్లు రావడం విశేషం. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) రీసెంట్ ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలనే 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించింది. రెస్పాన్స్ పరంగా మొదట్లో కాస్తా మిక్డ్స్ టాక్ రాగా.. ఆ తర్వత పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇటు వసూళ్లలోనూ అదే ధోరణి సాగింది. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 2.34 మిలియన్ల డాలర్స్ ను వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) - స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే జంటగా నటించి రొమాంటిక్ ఫిల్మ్ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. వసూళ్ల  పరంగా  ఓవర్సీస్ లో మాత్రం ఫర్వాలేదు అనిపించింది. 2022లో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 2.06 మిలియన్ల డాలర్స్ ను వసూల్ చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం అంచనాలు తప్పడంతో డిజాస్టర్ గా నిలిచినట్టు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. 
 

అవుట్ అండ్ అవుట్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన చిత్రం ‘ఎఫ్3’ (F3). వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించగా.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టగా యూఎస్ఏలోనూ తన మార్క్ చూపించింది. చివరి వరకు ప్రదర్శించగా 1.26 మిలియన్ల డాలర్స్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది. 
 

రీసెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న చిత్రం ‘సీతారామం’. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ అందమైన ప్రేమకథ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రం యూఎస్ఏలోనూ అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘సీతారామం’ 1.23 మిలియన్ల డాలర్స్ ను కలెక్ట్ చేసింది.  

దివంగత మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. టాలెంటెడ్ హీరో అడివిశేషు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా యూఎస్ఏలో అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఏకంగా 1.14 మిలియన్ల డాలర్స్ ను సాధించిన ఈ చిత్రం ఈ ఏడాది హ్యాయేస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్స్ గా నిలిచింది. 
 

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జంటగా జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తీకేయ 2’ (Karthikeya 2). ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్ మరియు యూఎస్ఏలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొద్ది కొద్దిగా ప్రారంభమైన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరేలా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం.. ఫస్ట్ వీకెండ్ లోనే ‘కార్తికేయ 2’ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 1.01 మిలియన్ల డాలర్స్ వసూళ్లను దాటేసిందని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ యూఎస్ లో తగ్గకపోవడంతో వసూల్ చేస్తూనే ఉంది. 
  
 

click me!