Intinti Gruhalakshmi: దూరమవుతున్న నందు లాస్య.. ఒక్కటి చేసే ప్రయత్నంలో తులసి?

First Published Dec 8, 2022, 10:49 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో అభి మామ్ విడిగా ఉంటున్నావు మీకు ఖర్చులు ఉంటాయి ఇలా మాకోసం ఖర్చు పెట్టడం ఎందుకు అని అనగా అప్పుడు వెంటనే తులసి నాతో ఇక్కడ పనిలేదు అంటున్నావా అని అనగా అలా అని కాదు మామ్ అని అంటాడు. నా ప్రపంచం మీరే, మిమ్మల్ని కాదనుకున్న రోజు నేను ఉండను అంటుంది తులసి. అప్పుడు నేను ఉన్నాను అని మీకు గుర్తు చేయడానికి ఇదంతా చేస్తున్నాను కాదనకండి అనడంతో వెంటనే అభి తులసి చేతులు పట్టుకొని మామ్ సారీ మామ్ అరే ఏంట్రా ఇది అని అనడంతో వెంటనే నందు వాళ్లు కొట్లాడుకుంటుండగా అందరూ ఆ మాటలు వింటూ ఉంటారు.
 

ఇప్పుడు ఎందుకు అంత నోరు చేస్తున్నావు నందు అని లాస్య అనగా ఎవరైనా పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలుసా ఇటువంటి అనుమానాలు అపోహలు లేకుండా కళ్ళు మూసుకుని నమ్మగలిగే మనిషి తోడు దొరుకుతుందని, ఇటువంటి మోసాలు, చీప్ ట్రిక్స్ లేకుండా జీవితాన్ని నమ్మగలిగే బంధం దొరుకుతుందని అని కోపంగా మాట్లాడుతాడు నందు. నేను అలాగే నమ్మాను కానీ నువ్వు ఆ నమ్మకాన్ని బంధాన్ని దిగజారేలా చేశావు. దానికి ఫలితం నేను నా ఫ్యామిలీనే కాదు నువ్వు కూడా అనుభవించాలి అని అంటాడు నందు. ఇప్పుడు లాస్య మాట్లాడడానికి ప్రయత్నించగా ఇక ఆపుతావా అని అంటాడు నందు.

నాకు గుర్తులేదు కానీ నువ్వైనా చెప్పు మనం పక్క పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకున్నాము చెప్పు లాస్య అని అంటాడు. ఇప్పుడు లాస్య బిక్క మొఖం వేయడంతో అప్పుడు లాస్య మధ్యలోకి తులసిని ఇన్వాల్వ్ చేస్తుంది. ప్రతిరోజు గొడవలు కొట్లాటలు ఉన్నా కానీ కలిసి పాతికేళ్ళు కాపురం చేశారు. ఆ ఓపిక సహనం ఎక్కడికి వెళ్ళిపోయినందు తులసికి ఒక రూలు నాకు ఒక రూలా అని అనడంతో ఎస్ అని గట్టిగా అరుస్తాడు నందు. తులసితో పాతికేళ్లు కలిసి ఉన్నాను పెళ్లి అనే బంధానికి కట్టుబడి అనడంతో నాతో కూడా అలాగే ఉండొచ్చు కదా అని అంటుంది లాస్య. మన మధ్య పెళ్లి బంధం కంటే ప్రేమ బంధం అనే గొప్పది ఉంది అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా పెద్దదిగా చేసి భూతద్దంలో చూపిస్తుంది అని అంటాడు నందు. 
 

ఎప్పుడూ చుట్టూ ఎంతమంది మన బంధాన్ని అక్రమ సంబంధం అని అని చెప్పినా కూడా నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు నాది ట్రూ లవ్ లాస్య అని అంటాడు నందు. కరెక్టే నందు నేను కూడా చెప్పేది ఒకసారి విను అని ఎమోషనల్ అవుతుంది లాస్య. తప్పులి అందరూ చేస్తారు అని లాస్య అనగా అవును నేను కూడా తప్పులు చేశాను కానీ నువ్వు మోసం చేశావు మా ఫ్యామిలీలో గొడవలు సృష్టించావు అని సీరియస్ అవుతాడు నందు. మనం లోకం దృష్టిలో మాత్రమే నువ్వు నేను భార్యాభర్తలం నాలుగు గోడల మధ్య నువ్వు ఎవరో నేనెవరో అని అనడంతో లాస్య షాక్ అవుతుంది. ఇప్పుడు లాస్య దొంగ ఏడుపులు ఏడ్చిన అందు పట్టించుకోకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.

అప్పుడు లాస్య బయటకు వెళ్లి నందు నాకు ఏదైనా కారణం నువ్వే నువ్వే రెస్పాన్సిబిలిటీ అని గోడకి తలబద్దలు కొట్టుకుంటూ ఉండగా అప్పుడు నందు అక్కడికి వచ్చి నువ్వు ఎన్ని చేసినా నేను మాత్రం నిన్ను పట్టించుకోను అనడంతో అప్పుడు లాస్య మళ్ళీ తలబద్దలు కొట్టుకుంటూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వచ్చి లాస్య ను లోపలికి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు పరంధామయ్య నందు మీద సీరియస్ అయ్యి బయటకు వెళ్ళిపోమని అరుస్తాడు. మరొకవైపు లాస్యకి తులసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లాస్యకి ఇలా గొడవలు పడకుండా ఎప్పుడూ కొంచెం లొంగి సర్ది చెప్పుకోవాలి తప్ప ఇలా చేసుకోకూడదు అని లాస్య మంచి మాటలు చెబుతూ ఉంటుంది తులసి.
 

అప్పుడు చూడు లాస్య నేను ఎప్పుడూ నందగోపాలగారి మీద ఆశ వదిలేసాను నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసేయ్. కానీ నువ్వు మాత్రం నన్ను పదే పదే మీ మధ్యలోకి లాగి ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావు అని అంటుంది తులసి. ఇప్పుడు ఏం చేస్తావు నందు నన్ను దూరం పెడుతున్నాడు అనడంతో వెంటనే తులసి పరాయి మొగుడిని లాక్కున్న దానివి నీ మొగుడిని నీ అదుపులో పెట్టుకోడానికి పెద్ద సమస్య కాదు ఆలోచించు అని అంటుంది తులసి. అప్పుడు లాస్య నేను నందు కోసం నా కొడుకుని నా భర్తను కూడా వదులుకొని వచ్చాను అనడంతో వెంటనే తులసి ఆయన కూడా నీకోసం చాలా అనుభవించారు. చాలామందిని వదులుకొని వచ్చారు అని అంటుంది. నువ్వే అనవసరంగా మీ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నావు అని తులసి లాస్యకి నచ్చ చెబుతుంది.
 

ఆ తర్వాత నందు కోపంతో రగిలిపోతూ ఉండగా అక్కడికి వెళుతుంది తులసి. అప్పుడు నందు నేను రాయబారం పంపిందా అని అనగా గొడవలు పెట్టడం మనశ్శాంతి లేకుండా చేయడం తప్ప తనకి అంత తెలివి లేదు నందగోపాల్ గారు అని అంటుంది. మా మొగుడు పెళ్ళాం మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఈ మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ తులసి. నా గురించి ఆలోచించడం మానేయ్ నా రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని అంటాడు నందు. అప్పుడు తులసి మళ్ళీ అలాంటప్పుడు మీ అమ్మానాన్నలను ఇక్కడే ఉండమని చెప్పి నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేయమన్నారు అని అడుగుతుంది తులసి.
 

ఈ ఇంటికి పెద్ద మీదే కాబట్టి మీరు ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడిన మీరు మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మానాన్న మన పిల్లలు అందరూ బాధపడాల్సి ఉంటుంది అని అంటుంది తులసి. మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అన్న విషయంపై మీకు సరైన క్లారిటీ లేదు నందగోపాల్ గారు. నన్ను మీరు చదువు రాని మొద్దు పల్లెటూరిది ఇలా ఎన్నో మాటలు అన్నా నేను పట్టించుకోలేదు. మరి చదువుకున్న పిల్ల పట్నం అమ్మాయి లాస్ అయిన ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. కానీ లాస్య కూడా మీకు నచ్చడం లేదు అనడంతో ఆ లాస్య ఎందుకు నాకు నచ్చలేదు నీకు కూడా తెలుసు కదా తులసి అని అంటాడు నందు. ఎందుకు తులసి లాస్య గురించి ఇలా ఆలోచిస్తున్నావు అని అనగా లాస్యనే కాదు ఆమె స్థానంలో ఎవరు ఉన్నా కూడా నీలాగే మాట్లాడతాను అని అంటుంది తులసి. లాస్య ఏడుపు చూసి బాధను తట్టుకోలేక మాట్లాడుతున్నాను. మీరిద్దరూ కలిసి ఉంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు మీరు నా మాట వింటారని ఆశతో మీకు నచ్చచెబుతున్నాను ప్రశాంతంగా ఉండండి అని అంటుంది తులసి.

click me!