ప్రస్తుతం వర్మ తాను తెరకెక్కించిన డేంజరస్ అనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రాంగోపాల్ వర్మ.. అప్సర రాణి, అరియనా, అషు రెడ్డి లాంటి యంగ్ బ్యూటీ లతో ఆఫ్ స్క్రీన్ లోనే రొమాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇంటర్వ్యూల పేరుతో వర్మ అరియనా, అషురెడ్డి లతో ఇప్పటికే బోల్డ్ చాట్ షో నిర్వహించారు. శృంగారం గురించి ఆ ఇంటర్వ్యూలలో వర్మ వల్గర్ గా మాట్లాడడం చూశాం. దీనితో అరియనా, అషురెడ్డి వర్మ వల్ల బాగా పబ్లిసిటీ పొందారు.