ప్రభాస్‌ సినిమాకి మంచు విష్ణు ఆడిషన్‌, నెటిజన్ల ట్రోలింగ్‌, ఇవన్నీ అవసరమా?

Published : Feb 16, 2025, 09:10 AM IST

Manchu vshnu-prabhas: మంచు విష్ణు ఏం చేసినా సెన్సేషన్‌ అవుతుంది. తాజాగా ఆయన ప్రభాస్‌ సినిమాకి ఆడిషన్‌ విషయం కూడా పెద్ద రచ్చ అవుతుంది.   

PREV
15
ప్రభాస్‌ సినిమాకి మంచు విష్ణు ఆడిషన్‌, నెటిజన్ల ట్రోలింగ్‌, ఇవన్నీ అవసరమా?
Manchu vshnu, prabhas:

Manchu vshnu-prabhas: ప్రభాస్‌ ప్రస్తుతం చేతిలో ఐదారు సినిమాలున్నాయి. వాటిలో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఓ మూవీ(ది రాజా సాబ్‌) మరో రెండు నెలల్లో విడుదల కాబోతుంది. మరో సినిమా(ఫౌజీ) ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా త్వరలోనే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీ ప్రారంభం కానుంది. అయితే దీనికి కాస్త టైమ్ పడుతుందట. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఈ మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

25
Manchu vshnu, prabhas:

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడిషన్‌ నిర్వహిస్తున్నారు. సందీప్‌ రెడ్డి వంగా ప్రొడక్షన్‌ భద్రకాళి పిక్చర్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందులో అన్ని ఏజ్‌ గ్రూపుల వారు, మేల్, ఫీమేల్‌ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సింది. తమ ఇంట్రడక్షన్‌ వీడియోని చేసి అందులో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత సెలక్ట్ చేసి ఆడిషన్‌ చేస్తారు. అయితే దీనికి మంచు విష్ణు కూడా ఆడిషన్ కి వెళ్లనున్నాడట. తాజాగా ఆయన అప్లై చేసుకున్నాడు. ఈ విషయాన్ని మంచు విష్ణునే ప్రకటించారు. 
 

35
Manchu vshnu

`యో.. నేను ప్లై చేసుకున్నా. ఏ జరుగుతుందో వెచి చూడాలి` అని తెలుపుతూ ట్వీట్‌ చేశారు మంచు విష్ణు. మంచు ఫ్యామిలీ వివాదాలతో ఓ వైపు, `కన్నప్ప` వంటి ప్రతిష్టాత్మక సినిమా చేస్తూ మరోవైపు మంచు విష్ణువార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు `కన్నప్ప`లో ప్రభాస్‌ నటించిన విషయం తెలిసిందే. ఆయన పాత్ర సుమారు 20 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్‌ సినిమా కోసం మంచు విష్ణు ప్రయత్నించడం విశేషం. అయితే ఆయన ఫన్నీవేలోనే అప్లై చేసినట్టు తెలుస్తుంది. అదే సినిమా సినిమాల ప్రమోషన్స్ కూడా ఇది ఉపయోగపడుతుందని విష్ణు ఇలా చేసి ఉంటారు. 

45
Manchu vshnu

దీన్ని పట్టుకుని నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మంచు విష్ణుని ఆడుకుంటున్నారు. ఆయన స్టయిల్‌లోనే `యో మిమ్మల్ని రిజెక్ట్ చేశామని అంటున్నారు. అంతేకాదు తన ఫ్యామిలీ వివాదంతో ముడిపెడుతూ ఖాళీగా ఉంటే జనరేటర్‌లో చక్కర పోస్కో గానీ, ప్రభాస్‌ సినిమాలో పెంట పెట్టకు అని, నీలో ఉన్న కసి మామూలు కసి కాదన్నా అని, అలాగే నాన్నగారిని ఇన్‌వాల్వ్ చేయాల్సింది, సిస్టర్‌తోపాటు అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తూ మీమర్స్, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదంతా ఫన్నీవేలో కావడం విశేషం. 
 

55
Kannappa

ఇక మంచు విష్ణ ప్రతిష్టాత్మకంగా `కన్నప్ప` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆయన కన్నప్పగా నటిస్తున్నారు. ప్రభాస్‌ నందిగా కనిపించబోతున్నారు. శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ నటిస్తున్నారు. వీరితోపాటు మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం వంటి భారీతారాగణం నటిస్తుంది. మైథలాజికల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. 

read more: ఎన్టీఆర్‌ `మనదేశం` సినిమా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత, ఆమె ఏజ్‌ ఎంతో తెలిస్తే షాక్‌

also read: అకీరా నందన్‌ కోసం నిర్మాతలు క్యూ, హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే? అకీరా క్రేజ్‌కి థియేటర్లు బ్లాస్ట్ !

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories