ఎన్టీఆర్‌ `మనదేశం` సినిమా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత, ఆమె ఏజ్‌ ఎంతో తెలిస్తే షాక్‌

Published : Feb 16, 2025, 08:34 AM IST

ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి ఇకలేరు. ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌ని విషాదంలో ముంచ్చెత్తారు.   

PREV
14
ఎన్టీఆర్‌ `మనదేశం` సినిమా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత, ఆమె ఏజ్‌ ఎంతో తెలిస్తే షాక్‌

ఒకప్పటి నటి, నిర్మాత, గాయని కృష్ణవేణి కన్నుమూశారు. నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) సినిమాల్లోకి పరిచయం చేసిన  నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. వయసు కారణం ఏర్పడే అనారోగ్యంతో ఆమె ఆదివారం ఉదయం మరణించారు. కృష్ణవేణి ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజా వారి భార్య కావడం విశేషం. కృష్ణవేణి.. ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేస్తూ `మనదేశం` సినిమాని నిర్మించారు. కృష్ణవేణి తన 102ఏళ్ల వయసులో కన్నుమూయడం విశేషం. 
 

24

కృష్ణవేణిది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి. ఆమె సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటిగా రాణించారు. 1936లో ఆమె `సతీ అనసూయ` చిత్రంలో బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు దాదాపు 15 సినిమాల్లో నటించింది. వీటితోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాల్లో `మోహినీ రుక్మాంగద`, `కచదేవయాని`, `మహానంద`, `జీవన జ్యోతి`, `దక్షయజ్ఞం`, `భీష్మ`, `బ్రహ్మరథం`, `మదాలస`, `మనదేశం`, `గొల్లభామ`, `లక్ష్మమ్మ` చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

34

కృష్ణవేణి.. నిర్మాత మీర్జాపురం రాజాని పెళ్లి చేసుకున్నారు. భర్తతోకలిసి చాలా సినిమాలు నిర్మించింది. అయితే నటిగా అయినా, నిర్మాతగా అయినా మన సంప్రదాయాలకు పెద్ద పీఠ వేస్తూ జానపద గీతాలకు ప్రయారిటీ ఇచ్చారు. 1949లో తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన `మనదేశం` చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారానే ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేసింది. ఈ మూవీ ద్వారనే ఎస్వీఆర్‌, ఘంటసాన వెంకటేశ్వరరావులను పరిచయం చేయడం విశేషం. ఆ తర్వాత ఎంతో మంది నటీనటులు, దర్శకులను టాలీవుడ్‌కి పరిచయం చేసింది కృష్ణవేణి. 
 

44

కృష్ణవేణి తన భర్త స్థాపించిన జయా పిక్చర్స్ పై పలు సినిమాలు నిర్మించింది. ఆ తర్వాత దీని పేరుని శోభనాచల స్టూడియోస్‌గా మార్చారు. అలాగే సొంతంగా తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎంఆర్‌ఏ ప్రొడక్షన్స్ స్థాపించారు. ఈ బ్యానర్స్ పై `మనదేశం`తోపాటు `లక్ష్మమ్మ`, `దాంపత్యం`, `గొల్లభామ`, `భక్త ప్రహ్లాద` వంటి అనేక చిత్రాలను నిర్మించి మెప్పించారు. ఆమె తెలుగు సినమా చేసిన సేవలకుగానూ 2004లో రాఘుపతి వెంకయ్య అవార్డుని సొంతం చేసుకుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories