త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే, వరస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

Published : Nov 07, 2025, 08:31 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన 54వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్, అదే విధంగా ఫ్లాప్ సినిమాల గురించి తెలుసుకుందాం.  

PREV
17
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 

 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శుక్రవారం నవంబర్ 7న తన 54వ జన్మదిన వేడుక సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల నుంచి త్రివిక్రమ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా త్రివిక్రమ్ కెరీర్ లో బెస్ట్ అండ్ వరస్ట్ మూవీస్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ తన కెరీర్ లో అతడు, జులాయి, అరవింద సమేత లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. అదే విధంగా ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

27
అతడు 

అతడు  నువ్వే నువ్వే లాంటి మంచి ప్రేమ కథాచిత్రం తెరకెక్కించిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో అతడు సినిమా చేశారు. అప్పట్లో ఆడియన్స్ కి ఈ చిత్రం సరికొత్త అనుభూతి అందించింది. మర్డర్ మిస్టరీ కథాంశానికి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించిన విధానం సరికొత్తగా ఉంటుంది. త్రివిక్రమ్ స్టైలిష్ మేకింగ్ అందరినీ థ్రిల్ చేసింది. ఇది త్రివిక్రమ్ కెరీర్ లోనే కాదు, మహేష్ కెరీర్ లో కూడా బెస్ట్ మూవీస్ లో ఒకటి. 

37
జులాయి

హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్ ఆధారంగా నడిచే కథ ఇది. బ్యాంక్ రాబరీ కథాంశానికి త్రివిక్రమ్ తనదైన శైలిలో కామెడీ, సాంగ్స్, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సూపర్ హిట్ చేశారు. అల్లు అర్జున్, సోనూ సూద్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ లో హైలైట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. దేవిశ్రీ అందించిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

47
అత్తారింటికి దారేది 

మేనత్తని తిరిగి తీసుకుని వచ్చి తాత కోరిక నెరవేర్చాలి అనుకునే మనవడి కథ ఇది. ఈ సింపుల్ స్టోరీకి త్రివిక్రమ్ తన డైలాగ్స్, దర్శకత్వంతో మ్యాజిక్ చేశారు. పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. పవన్ తో సమంత, ప్రణీత సుభాష్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో నదికి పోలేదా స్వామి అంటూ పవన్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కడుపుబ్బా నవ్వించింది. ఫలితంగా అత్తారింటికి దారేది చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

57
అరవింద సమేత వీర రాఘవ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త పంథాలో తెరకెక్కించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ ఫ్యాక్షన్ కథాంశాన్ని ఈ మూవీలో త్రివిక్రమ్ కొత్తగా చూపిన విధానం బాగా వర్కౌట్ అయింది. ఎన్టీఆర్ ఈ మూవీలో నట విశ్వరూపం ప్రదర్శించారు. జగపతి బాబు విలన్ గా అదరగొట్టారు. 

67
అల వైకుంఠపురములో 

మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మ్యాజిక్ చేశారు. ఈ జోనర్ లో తాను ఎంత అద్భుతంగా సినిమాలు తీయగలనో అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ యువతని బాగా ఆకట్టుకుంది. తమన్ అందించిన పాటలే ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. 

77
త్రివిక్రమ్ కెరీర్ లో వరస్ట్ మూవీస్ 

త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఫ్యాన్స్ నమ్ముతారు. కానీ వారి నమ్మకాన్ని త్రివిక్రమ్ తొలిసారి వమ్ము చేసింది అజ్ఞాతవాసి చిత్రంతోనే. అప్పటికి అజ్ఞాతవాసి చిత్రం టాలీవుడ్ లోనే అత్యంత భారీ అంచనాలతో విడుదలైన చిత్రంగా నిలిచింది. తొలి షో నుంచే ఫ్యాన్స్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. త్రివిక్రమ్ కెరీర్ లో చెత్త సినిమా అంటే ఇదే. ఖలేజా సినిమా కూడా ఫ్లాప్ అయింది కానీ.. ఇప్పుడు ఆ చిత్రాన్ని ఆడియన్స్ టీవీల్లో రిపీటెడ్ గా చూస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories