తాగిన మత్తులో 10 వేల ఉద్యోగం వదిలేసిన నటుడు ఎవరో తెలుసా? ఆ తాగుడు వల్లే స్టార్ కమెడియన్ గా గుర్తింపు ?

Published : Nov 07, 2025, 07:53 AM IST

తాగిన మత్తులో 10 వేల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి 250 రూపాయల జాబ్ లో జాయిన్ అయిన నటుడు ఎవరో తెలుసా? ఆ తాగుడు వల్లే ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.. ఓ ఇంటర్వ్యలో అసలు విషయం వెల్లడించారు.

PREV
15
కనుమరుగైన స్టార్ కమెడియన్స్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. ఎవరి మార్క్ కామెడీ వారిది. ఎవరినీ ఎవరు ఇమిటేట్ చేసేవారు కాదు. తమకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకుని.. కామెడీ టైమింగ్ తో నవ్వించేవారు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. అయితే ఈమధ్య కాలంలో చాలామంది కమెడియన్స్ కనుమరుగయ్యారు. వరుసగా పదిమంది వరకూ స్టార్ కమెడియన్స్ 10 ఏళ్ల గ్యాప్ లో కన్నుమూశారు. ధర్మవరపు, ఏవీఎస్, గుండు హనుమంతురావు, కొండవలస, లక్ష్మీపతి, మల్లిఖార్జునరావు, ఆహుతీ ప్రసాద్, వేణు మాధవ్..ఇలా వీరితో పాటు మరో స్టార్ కమెడియన్ కూడా హఠాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆయన మరెవరో కాదు ఎం ఎస్ నారాయణ.

25
తాగుబోతు పాత్రలకు బ్రాండ్

తాగుబోతు పాత్రలు ఎమ్మెస్ చేసినంత అద్భుతంగా మరెవరు చేసేవారు కాదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఎవరు అనుకరించలేనంత కష్టంగా ఉండేది. అంతే కాదు ఎమ్మెస్ కామెడీ టైమింగి, ఆయన డైలాగ్ డెలివరీ.. చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఎమ్మెస్ సీన్ లో కనిపించడాడంటే నవ్వు ఆపుకోవడం కష్టమే. అలాంటి స్టార్ కమెడియన్ అకస్మాత్తుగా.. అనారోగ్యంతో మరణించి..కామెడీ లవర్స్ ను విషాదంలో ముంచి వెళ్లిపోయాడు. అయితే ఆయన లైఫ్ కు సబందించిన కొన్ని విషయాలు మాత్రం పలు ఇంటర్వ్యూలలో ఎమ్మెస్ వెల్లడించారు. తాను ఫస్ట్ నుంచి ఎలా లైఫ్ ను లీడ్ చేశారు, ఎలా నటుడు అయ్యారు.. ఎలా స్టార్ అయ్యారు లాంటి విషయాలు పలు సందర్భాల్లో ఎమ్మెస్ చెప్పుకొచ్చారు.

35
10 వేల జాబ్ పోగొట్టుకుని..

ఈక్రమంలో తాగుడు పాత్రలు చేయడమే కాదు.. తాగిన మత్తులో ఉద్యోగం కూడా పోగోట్టుకున్నారట ఎమ్మెస్ నారాయణ. టీచర్ గా మంచి జాబ్, అప్పట్లోనే 10 వేల జీతం.. కానీ లెక్చరర్ అనిపించుకోవాలి అనే ఆశ ఉండేది. దానికి తగ్గ క్వాలిఫికేషన్ కూడా ఎమ్మెస్ నారాయణకు ఉంది. కానీ లెక్చరర్ జాబ్ చేస్తే వచ్చేది 250 రూపాయిలు.. కానీ పదివేల జీతం వచ్చే ఉద్యోగం ఎలా వదిలేసుకోవాలి. తాగితే వెంటనే నిర్ణయం తీసుకోగలం..అప్పుడు ఎక్కడ లేనీ ధైర్యం వస్తుంది.. వెంటనే తాగి టీచర్ జాబ్ వదిలేసుకుని, లెక్చరర్ గా జాయిన్ అయ్యారు ఎమ్మెస్. లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూనే.. వీకెండ్ లో మద్రాస్ వెళ్లి మేకర్స్ కు కథలు చెప్పి వస్తూ ఉండేవారట ఎమ్మెస్ నారాయణ.

45
మరణించే వరకూ బిజీ ఆర్టిస్ట్ గా..

ఆతరువాత కాలంలో మద్రాస్ వెళ్లి.. అవకాశాల కోసం రోడ్లెంట తిరిగి.. సాయంత్రానికి ఎలాగైనా ఫ్రెండ్స్ తో కలిసి మందుకొట్టడం ఎమ్మెస్ కు అలవాటుగా ఉండేదట. తినడానికి డబ్బులు ఉండేవి.. మందు కోసం ఫ్రెండ్స్ ఏదో ఒకటి అరేంజ్ చేసేవారు. మద్రాసులో మరీ తిండికి కూడ ఇబ్బంది పడిన రోజులు లేవు.. కానీ సినిమా అవకాశా కోసం మాత్రం ఎన్నో ఇబ్బందులు, అవమానాలు చూశాను అని ఎమ్మెస్ నారాయణ ఇంటర్వ్వూలో వెల్లడించారు. ఎమ్మెస్ నారాయణకు చేసే పనిమీద ఎంత గౌరవం ఉండేదంటే.. తాను చేస్తున్న పని ఏదైనా.. దాన్ని దేవుడిలా భావించేవారు. మా నాన్నకు పెళ్లి సినిమాలో తాగుబోతు పాత్రతో ఫేమస్ అయిన ఎమ్మెస్ నారాయ.. ఆతరువాత కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. వారుసగా హిట్ల మీద హిట్లు కొట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగారు. మరణించే వరకూ బిజీ ఆర్టిస్ట్ గానే కొనసాగారు ఎమ్మెస్.

55
ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే..

ఎమ్మెస్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''పనే దేవుడు, చేసే పనిని గౌరవిస్తే.. ఆ దేవుడిని పూజించినట్టే. నా డైరీలో ఒకటి రాసుకున్నాను.. ప్రయత్నిస్తూ.. మరణిస్తే నువ్వు గెలిచినట్టే.. ప్రయత్నం చేయకుండా వదిలేసినా మరణించినట్టే.'' అని ఎమ్మెస్ అన్నారు. తాగుడు మానేయాలని కొన్ని సందర్బాల్లో అనుకున్నాట ఎమ్మెస్. కానీ దాని వల్ల ఒరిగిందేమి లేదు. తాగి ఎవరినైనా ఇబ్బందిపెడితే.. మానేయాలన్న ఆలోచన చేయవచ్చు. కానీ అలాంటి పనులు చేయనప్పుడు దాని గురించి ఆలోచిస్తూ.. మానేయాలని ఘర్షణ పడటం ఎందుకు? అందుకే కొన్ని సందర్భాల్లో మానేసినా.. ఆతరువాత తెలియకుండా మొదలు పెట్టేవాడిని అని ఎమ్మెస్ అన్నారు. తాగుబోతు పాత్రలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎమ్మెస్.. ఈలోకాన్ని వదిలి దాదాపు పదేళ్లు అవుతోంది. కానీ ఆయన చేసిన పాత్రలు మాత్రం ఇప్పటికీ ఆడియన్స్ ను నవ్విస్తూనే ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories