
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో నా కూతురిని పెళ్లి కూతురిలా చూడాలని ఉందని జ్యో, పారులకు షాక్ ఇస్తుంది సుమిత్ర. మరోసారి ఆలోచించమని అడుగుతుంది పారు. సుమిత్ర తన నిర్ణయం చెప్పింది కదా పిన్ని.. ఇంకా వదిలేయండి అంటాడు దశరథ. సుమిత్ర మాటలకు కార్తీక్, దీప కూడా షాక్ అవుతారు. అమ్మ దగ్గరినుంచి నేను ఈ మాట ఊహించలేదు అంటుంది దీప. నేను కూడా అంటాడు కార్తీక్. ఏవండీ మీరైనా మరొకసారి ఆలోచించండి అంటుంది పారు. ఆలోచిస్తాను. కానీ ఇక్కడ కాదు బోర్డు మీటింగ్ లో అంటాడు శివన్నారాయణ.
బావే సీఈఓ అని నాకు అర్థమవుతోంది గ్రానీ. దీన్ని ఎలాగైనా ఆపాలి అంటుంది జ్యోత్స్న. ఓ పని చేయ్. దీపను రిక్వెస్ట్ చెయ్. మీ అమ్మ సపోర్ట్ నీకు ఎలాగు లేదు. దీపను రిక్వెస్ట్ చేస్తే.. అది చెప్తే కార్తీక్ నీ వైపు నిలబడతాడు. అప్పుడు మీ తాత కార్తీక్ మాట వింటాడు. నీ సీఈఓ పోస్ట్ ఎక్కడికి పోదు అంటుంది పారు. మంచి ఐడియా గ్రానీ. నేను వెళ్లి దీపను అడుగుతాను అంటుంది జ్యోత్స్న.
కిచెన్ లో ఉన్న దీప దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడుతుంది జ్యోత్స్న. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటుంది. పనివాళ్ల సహాయం మీరు తీసుకోరు కదా అమ్మాయిగారు అంటుంది దీప. ఇప్పుడంటే పని మనిషివి కానీ.. ఒకప్పుడు మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అంటుంది జ్యోత్స్న. పైగా నువ్వు మా బావ భార్యవి. నా మేనత్త కోడలివి అంటుంది జ్యోత్స్న.
ఇప్పుడు ఎందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి. నాకు పనుంది అంటుంది దీప. నేను సీఈఓగా కొనసాగడానికి నీ హెల్ప్ కావాలి. బావను నాకు సపోర్ట్ చేయమని చెప్పాలి అంటుంది జ్యోత్స్న. మా బావ నా మాట వినడు అంటుంది దీప. నువ్వు ఈ హెల్ప్ చేస్తే బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను అంటుంది జ్యోత్స్న. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఆలోచిస్తాను అంటుంది దీప.
దీప ఆలోచిస్తాను అని చెప్పింది గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఇది వర్కౌట్ అయ్యేలా లేదే అంటుంది పారు. దీప దగ్గర కొంచెం ఎమోషనల్ డ్రామా చేశాను. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని ఆఫర్ ఇచ్చాను అంటుంది జ్యోత్స్న. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా వాళ్లు నమ్మరు. అయినా అగ్రిమెంట్ నుంచి తప్పుకోవడానికి వాళ్లకు చాలాసార్లు అవకాశం వచ్చింది అయినా వదులుకున్నారు. నువ్వేమో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఆ విషయాన్ని చెప్పి వచ్చావు. ఇది పనిచేయదు. కానీ వెళ్లి మీ అమ్మ కాళ్లమీద పడు అంటుంది పారు.
ఆమె నిర్ణయం ఏంటో విన్నాక కూడా వెళ్లాలా? అంటుంది జ్యోత్స్న. అయితే సీఈఓ పదవికి రాజీనామా చేసి పెళ్లి చేసుకో అంటుంది పారు. పెళ్లికి నేను రెడీగా లేను. ఒక్కసారి మూడు ముళ్లు పడితే ఇష్టమైనా, కష్టమైనా కలిసే ఉండాలి. అది నావల్ల కాదు. అయినా సీఈఓ పదవి ఉంటే బావే నా భర్త. అది ఎలా జరుగుతుందో తర్వాత చెప్తాను. కానీ సీఈఓగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి గ్రానీ అంటుంది జ్యోత్స్న. సరే నువ్వు వెళ్లు. నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. నేను ఉన్నాను కదా అంటుంది పారు. థాంక్స్ గ్రానీ అంటుంది జ్యోత్స్న.
అంతా కలిసి ఆఫీసుకు బయల్దేరుతారు. నేను నీతో మాట్లాడాలి బావ అంటుంది జ్యోత్స్న. డ్రైవర్ తో నీకు మాటలేంటి అంటాడు కార్తీక్. నువ్వు ఎందుకు తప్పించుకుంటున్నావో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న. నన్ను రెచ్చగొట్టావు. ఈ గొడవలన్నీ నువ్వే చేశావు. నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు. నా కుటుంబాన్నే నాకు వ్యతిరేకంగా నిలబెట్టావు. ఎందుకు ఇంత దిగజారిపోయావు బావ అంటుంది జ్యోత్స్న.
ఆ మాటకు కోపం తెచ్చుకున్న కార్తీక్.. దిగజారిపోయింది నువ్వు. వంటింట్లో నువ్వు నా భార్యతో బేరాలు ఆడటం నేను చూశాను. అది వర్కౌట్ కాలేదని ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నావు. మీటింగ్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో అని లోలోపల భయపడి చస్తున్నావు అంటాడు కార్తీక్. నాకేం భయం నేను అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వేం చేయలేవు అంటాడు కార్తీక్. చూస్తాను అంటూ లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్స్న. పిలుపు వస్తే నేను కూడా వస్తాను అంటాడు కార్తీక్. పిలుపు రాకుండా చేస్తాను అంటుంది జ్యోత్స్న.
బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమైన వాళ్లు ఇంకా రాలేదు అంటాడు ఒక బోర్డ్ మెంబర్. ఇంతలో జ్యోత్స్న లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ముఖ్యమైన వాళ్లు అనుకున్నాక రాకుండా ఎలా ఉంటారు అంకుల్ అని అంటుంది జ్యోత్స్న. మనం అందంరం కలిసి ఉంటేనే అభివృద్ధి. ఒక్కటిగా ఉండాలి అని చెప్తుంది. మీరు మళ్లీ సీఈఓగా ఉంటే.. అని మాట పూర్తిచేయడానికి ఇబ్బంది పడతాడు బోర్డు మెంబర్.
నా నిర్ణయం ఇంకా చెప్పలేదు కదా.. మీరెందుకు అప్పుడే మాట్లాడుతున్నారు అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న సీఈఓగా ఉంటే మేము ఇక్కడ ఉండలేము అంటారు బోర్డ్ మెంబర్స్. దశరథ కూడా వారికే సపోర్ట్ చేస్తాడు. కార్తీక్ ని పిలవమని చెప్తాడు శివన్నారాయణ. డౌట్ లేదు.. బావే కొత్త సీఈఓ దీన్ని ఎలాగైనా ఆపాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.