స్టార్ హీరోలకు సమానంగా అనుష్క ఇమేజ్
టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అనుష్క గుమ్మం ముందు వచ్చి నిలుచుకున్నాయి. తెలుగులో నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. తమిళంలో సూర్య, విక్రమ్, విశాల్ లాంటి స్టార్స్ తో ఆడిపాడింది బ్యూటీ. టాలీవుడ్ లో ప్రభాస్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది అనుష్క. బాహుబలి సినిమాతో వీరి బంధం బలపడింది.
ప్రభాస్, అనుష్క స్నేహంపై రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. వీరు ప్రేమలోఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న వార్తలు వ్యాపించాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టే 40 ఏళ్లుదాటిని పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్లుగా ఉండిపోయారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇవేమి పట్టించుకోకుండా ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.