`కింగ్డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన సందీప్‌రెడ్డి వంగా, థియేటర్లు బ్లాస్టే.. విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ సూపర్‌స్టార్‌

Published : Jul 25, 2025, 10:21 PM IST

దర్శకుడు సందీప్‌రెడ్డి `కింగ్‌డమ్‌` మూవీకి సంబంధించిన తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూతో హైప్‌ ఇచ్చాడు సందీప్‌. 

PREV
15
`కింగడమ్‌` ప్రమోషన్స్ షురూ

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన `కింగ్‌డమ్‌` మూవీ ఈ వారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

 ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది యూనిట్‌. వరుసగా పాటలు విడుదల చేశారు. శనివారం ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు.

DID YOU KNOW ?
సందీప్‌ రెడ్డి ఫస్ట్ మూవీ
సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా తొలి మూవీ `అర్జున్‌రెడ్డి` విజయ్‌ దేవరకొండ హీరోగానే చేసిన విషయం తెలిసిందే. అది బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది.
25
సందీప్‌ రెడ్డి వంగా హోస్ట్ గా `కింగ్‌డమ్` ఇంటర్వ్యూ

తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో కలిసి ఇంటర్వ్యూ చేశారు విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఇందులో సందీప్‌ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూని శుక్రవారం విడుదల చేశారు.

సినిమా గురించి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు సందీప్‌. సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. తాను 15 మినిట్స్ సినిమా చూసినట్టు, ఆర్‌ఆర్‌ లేకుండా సుమారు 45 నిమిషాలు చూసినట్టు తెలిపారు.

35
`కింగ్‌డమ్‌`పై సందీప్‌రెడ్డి వంగా రివ్యూ

సినిమాపై గూస్‌బంమ్స్ తెప్పించే విషయాలు వెల్లడించారు. సినిమా చూశాను, ఈ క్రమంలో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ లేదనే విషయాన్ని మర్చిపోయాను. అంత బాగా కనెక్ట్ అయ్యింది. అస్సలు మ్యాడ్‌ అనిపించింది. 

అనిరుథ్‌ మ్యూజిక్‌ న్యూ టెంప్లేట్లో ఉంటుంది. ఆర్‌ఆర్‌ అదిరిపోతుందని చెప్పారు సందీప్‌. అదే సమయంలో మ్యూజిక్‌ సాలిడ్‌గా ఉంటుందన్నారు. 

విజయ్‌ దేవరకొండ పవర్‌ పాక్డ్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చాడని, సూపర్‌ హిట్‌కొట్టావు గౌతమ్‌ అంటూ ప్రశంసలు కురిపించారు సందీప్‌ రెడ్డి వంగా. సినిమా అదిరిపోయిందని, వేరే లెవల్‌ అని ఆయన చెప్పకనే చెప్పారు.

45
మూడు డిఫరెంట్‌ గెటప్స్ లో విజయ్‌ దేవరంగొండ

లొకేషన్స్, వాడిన వెయికల్స్ రియలిస్టిక్గా ఉన్నాయని, అదే సమయంలో ఇందులో విజయ్‌ మూడు డిఫరెంట్‌ గెటప్స్ లో కనిపిస్తున్నట్టు లీక్‌ చేశారు. ఆయన లుక్స్ అదిరిపోయిందని చెప్పారు సందీప్‌.

 అయితే ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ సమయంలోనే సందీప్‌ తనకు ఫోన్‌ చేసినట్టు విజయ్‌ దేవరకొండ తెలిపారు. `లుక్‌ అదిరిపోయింది విజయ్‌. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంద`ని చెప్పాడని విజయ్‌ దేవరకొండ తెలిపారు. 

సందీప్‌ రెడ్డి వంగా కేవలం తనకు నచ్చితేనే ఫోన్‌ చేస్తాడు. లేదంటే చేయడు, ఆయన చెప్పాడంటే నిజంగానే సినిమా బాగున్నట్టే అని విజయ్‌ చెప్పడం విశేషం. దీంతో సినిమాపై తన రివ్యూతో హైప్‌ ఇచ్చాడు సందీప్‌.

55
ఊహించని కథతో `కింగ్‌డమ్`

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్‌డమ్‌`లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ గురంచి విజయ్‌ చెబుతూ, ఈ కథని ఎవరూ ఊహించలేరని, చాలా సర్‌ప్రైజ్‌ ఫీలవుతారని తెలిపారు. 

ఎక్కువ స్టోరీని రివీల్‌ చేయోద్దని సందీప్‌ రెడ్డి వంగా చెప్పడం విశేషం. సినిమా కోసం తాను ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపారు. సందీప్‌ కామెంట్స్ సినిమాపై హైప్‌ పెంచుతుంది. విజయ్‌కి మరో బ్లాక్‌ బస్టర్ పడబోతుందని, ఆయన స్టామినాని చూపించే మూవీ రాబోతుందని సందీప్‌ మాటల ద్వారా అర్థమవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories