6 సినిమాలు రీమేక్ చేస్తే, ఒక్కటే హిట్, స్టార్ హీరోయిన్ కు కలిసిరాని బాలీవుడ్

Published : May 04, 2025, 09:45 AM IST

సౌత్ లో  ఆమె స్టార్ హీరోయిన్. ఇక్కడ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. కాని ఆమె నటించిన 6  సినిమాలను హిందీలో రీమేక్ చేయగా.. వాటిలో ఒక్కటి మాత్రమే హిట్ కొట్టింది. మరి ప్లాప్ అయిన ఆ ఐదు సినిమాలు ఏంటి? ఇంతకీ ఎవరా హీరోయిన్? 

PREV
17
6 సినిమాలు రీమేక్ చేస్తే, ఒక్కటే హిట్, స్టార్ హీరోయిన్ కు  కలిసిరాని బాలీవుడ్
త్రిషా కృష్ణన్ సినిమాలు

ఆమె మరెవరో కాదు..సౌత్ స్టార్ హీరోయిన్  త్రిష కృష్ణన్.  42 ఏళ్ల వయసులో ఉన్న త్రిష..ఇప్పటికే హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనేక హిట్ చిత్రాలలో నటించారు. అంతేకాకుండా, ఆమె నటించిన 6 సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమాల గురించి తెలుసుకుందాం

Also Read:  42 ఏళ్ల త్రిష ఆస్తి ఎన్ని కోట్లు? స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్, నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

27
పోలీస్‌గిరి

1. 2003లో వచ్చిన త్రిష కృష్ణన్ సినిమా సామిని హిందీలో పోలీస్‌ గిరిగా రీమేక్ చేశారు. సంజయ్ దత్ - ప్రాచీ దేశాయ్ నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది.

Also Read: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?

37
బాఘీ

2. త్రిష కృష్ణన్ ప్రభాస్ జంటగా నటించిన  సినిమా వర్షం. 2004లో విడుదలైన  ఈ సినిమాను 2016లో బాఘీ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ , శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

Also Read:అల్లు అర్జున్ ఓవర్ యాటిట్యూడ్ అంటూ, మండిపడుతున్న నెటిజన్లు, ఫ్యాన్స్ ని పట్టించుకోరా?

47
యువా

3. 2004లో వచ్చిన త్రిష కృష్ణన్ సినిమా అయిత ఏళుదును కూడా బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. 2004లోనే యువా పేరుతో హిందీలో మల్టీస్టారర్ చిత్రం వచ్చింది, అది డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఈషా దేఓల్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ లాంటి స్టార్స్  నటించారు.

57
రమయ్యా వస్తావయ్యా

4. త్రిష నటించిన తెలుగు హిట్ మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా 2005లో విడుదలైంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తర్వాత హిందీలో దీనిని 2013లో రమయ్యా వస్తావయ్యా పేరుతో రీమేక్ చేశారు, అది ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రంలో గిరీష్ తౌరాని, శృతి హాసన్ మరియు సోనూ సూద్ నటించారు. 

67
ఏక్ ది పవర్ ఆఫ్ వన్

5. త్రిషా కృష్ణన్ 2005లో మహేష్ బాబు జోడీగా అతడు సినిమాలో నటించారు. ఈసినిమా సూపర్  హిట్ అయ్యింది. ఇక  2009లో బాలీవుడ్‌లో దీనిని ఏక్ ది పవర్ ఆఫ్ వన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రంలో బాబీ డియోల్,  శ్రియా శరన్ నటించారు.

77
జై హో

6. 2014లో వచ్చిన సల్మాన్ ఖాన్ ,  డైసీ షా నటించిన జై హో చిత్రం త్రిష కృష్ణన్ నటించిన స్టాలిన్ చిత్రానికి రీమేక్. త్రిషా సినిమా హిట్ అయితే, సల్మాన్ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. 

click me!

Recommended Stories