50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?

Published : May 04, 2025, 08:16 AM IST

అక్కినేని ప్యామిలీలో మరోసారి పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. ఆమధ్య నాగచైతన్య రెండో పెళ్ళి హీరోయిన్ శోభితతో జరిగింది. ఇక త్వరలో అఖిల్ పెళ్లి  జరగబోతోంది. కాగా అక్కినేని ఇంటి నుంచి మరో పెళ్లి కూడా జరగబో తున్నట్టు తెలుస్తోంది. హీరో సుమంత్ ఐదు పదుల వయస్సులో రెండో పెళ్ళికి రెడీ అయినట్టు సమాచారం. 

PREV
15
50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?

అక్కినేని ఫ్యామిలీల రెండో పెళ్లి చాలా  కామన్ గా మారింది. నాగార్జున, నాగచైతన్య, తాజాగా హీరో సుమంత్ కూడా రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అటు అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ తరువాత బ్రేకప్ చేసుకుని.. మరోపెళ్లికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సుమంత్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరు?  అసలు ఈ వార్తలో నిజం ఎంత..? 

25

అక్కినేని ఫ్యామిలీ హీరోలలో సుమంత్ కూడా ఒకరు.  పెద్దాయన నాగేశ్వరావు కు ఎంతో ఇష్టమైన మనవడు సుమంత్.  హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కెరీర్ బిగినింగ్ లో మంచి మంచి సినిమాలు చేసని ఈ హీరో.. ఆతరువాత వరుసగా ప్లాప్ లు ఫేస్ చేశాడు.కొన్నాళ్లు ఇండస్ట్రీని పట్టించుకోలేదు సుమంత్. ఇక ఈమధ్య కొన్ని సినిమాల్లో నటించి మళ్లీ యాక్టీవ్ అయ్యాడు.   సుబ్రహ్మణ్యపురం లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ చేశాడు సుమంత్. 
 

35

అయితే 2004 లో హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు  సుమంత్. కాని వీరి కాపురం రెండేళ్ళు కూడా సాగలేదు. అభిప్రాయబేధాల కారణంగా పెళ్లైన రెండేళ్ళకే వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయినా కాని తాము ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నామని సుమంత్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే విడాకులు తీసుకున్నప్పటి నుంచీ ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు సుమంత్. 
 

45

మధ్యలో కొన్ని సందర్భాల్లో సుమంత్ పెళ్లివార్తలు వినిపించినా..అవి నిజంఅకాలేదు. తాజాగా మరోసారి సుమంత్ రెండో పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.  అంతే కాదు హీరోయిన్ ను కొన్నాళ్లుగా సుమంత్ ప్రేమిస్తున్నాడని, త్వరలో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ హీరోయన్ ఎవరు అనే పేరు మాత్రం బయటకు రాలేదు. 

55

అంతే కాదు అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా అఫీషియలో గా ఎటువంటి అప్ డేట్ లేదు. మరి సుమంత్ పెళ్లి విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. 50 ఏళ్ల వయస్సులో సుమంత్ ప్రేమ పెళ్లి రూమర్స్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్.  

Read more Photos on
click me!

Recommended Stories