
యష్.. `కేజీఎఫ్` మూవీస్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కన్నడ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన ఇప్పుడు `టాక్సిక్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. `కేజీఎఫ్ 2` విడుదలైన నాలుగేళ్లకి యష్ ఈ మూవీతో రాబోతున్నారు. గీతా మోహన్ దాస్ దీనికి దర్శకత్వం వహించగా, దర్శకురాలితోపాటు యష్ దీనికి కథ అందించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై కేవీ నారాయణ నిర్మించారు. సుమారు రూ.500-600కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి వారు హీరోయిన్లుగా నటించారు. రాఖీ స్పెషల్‌గా ఈ మూవీ ఆగస్ట్ 26న రిలీజ్ అవుతుంది.
అయితే ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్‌ని పొందింది. 18ఏళ్లు పై బడ్డ వారే ఈ సినిమాని చూడాలి. దీనికి సంబంధించిన చిత్ర బృందం ఇప్పటికే వార్నింగ్ నోట్‌ని రిలీజ్ చేసింది. మితిమీరిన రొమాన్స్, యాక్షన్, హింస, మ ద్యం, ధూమపానం వంటివి ఇందులో చూపించారట. దీంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాని పెద్ద వాళ్లు మాత్రమే చూడాలి. ఇది మూడు గంటల 14 నిమిషాల నిడివితో ఉంటుందట. సినిమాని ఇప్పటికే కొంత మంది క్రిటిక్స్, బయ్యర్లు చూశారు. వారి రిపోర్ట్ ప్రకారం మూవీ ఎలా ఉందనేది తేలిపోయింది.
ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా, గోవా మాత్రం పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉంది. హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉన్నట్టుగా. అలాంటి సమయంలో గోవాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతుంటాయి. మాఫియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం, ఆధిపత్యం కోసం పోరాటం, చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం కొన్ని గ్రూపులు పోరాడుతుంటాయి. ఈ క్రమంలో మితిమీరిన హింస, రక్తపాతం జరుగుతుంటుంది. వెన్నెపోట్లు, మోసం, దగా, పవర్ పాలిటిక్స్ కామన్‌గా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్) ఎలా నిలబడ్డాడు, ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఆయన ఎలాంటి పోరాటం చేశాడు అనేది సినిమా. ఇందులో యష్ చెల్లిగా గంగ పాత్రలో నయనతార నటిస్తుంది. ఆయన ప్రియురాలిగా నదియా పాత్రలో కియారా అద్వానీ కనిపించబోతుందట. సొంత చెల్లినే అన్నని చంపేందుకు కుట్ర చేస్తుందట. మరి దానికి కారణం ఏంటి? ఇందులో రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా పాత్రలేంటి? అనేది సినిమా. మూవీలో మరో హైలైట్ ఏంటంటే.. ఇందులో యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయగా, రూమిగా కనిపిస్తారు. అదే సమయంలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఆయన కనిపించబోతున్నారు.
సినిమా ఎలా ఉందనేది చూస్తే, రెండు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యష్ రెండు పాత్రల్లో ఇరగదీశారట. నట విశ్వరూపం చూపించారని సమాచారం. కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ని చూడొచ్చు అంటున్నారు. సినిమా మెయిన్‌గా కథ ప్రధానంగా సాగుతుంది. దీంతో కథలో చాలా డెప్త్ ఉంటుంది. సినిమాని లీనమై చూస్తేనే అర్థమవుతుందంటున్నారు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని టాక్. ఇక కియారా అద్వానీతో యష్ రొమాంటిక్ సీన్లు మతిపోయేలా ఉంటాయట. కుర్రాళ్లకి అవి ట్రీట్ అంటున్నారు. కియారా నటన అదిరిపోతుందని అంటున్నారు. నదియాగా ఆమె మైండ్ బ్లాక్ చేస్తుందట. అదే సమయంలో నయనతార, యష్ మధ్య వచ్చే ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. రుక్మిణి వసంత్ హ్యూమా ఖురేషి, తారా సుతారియా పాత్రలు సర్‌ప్రైజ్ చేస్తాయట.
సినిమాలో ప్రతి ఫ్రేమ్ వాహ్ అనిపించేలా, చాలా లావిష్‌గా, గ్రాండియర్‌గా ఉంటుందట. విజువల్ ట్రీట్ అంటున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎం సినిమాకి ప్రాణం పోస్తాయని, అవే హైలైట్ అని సమాచారం. యాక్షన్ సీన్లు సినిమాకి మరో హైలైట్ అని, విజిల్స్ వేయిస్తాయని చెబుతున్నారు. టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టుగా రొమాన్స్, యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో ఎమోషన్స్ కి ప్రయారిటీ ఉంటుందట. తాను కింగ్ గా ఎదిగేందుకు రాయ చేసిన పోరాటం ఆసక్తికరంగా ఉంటుందని, రాయ, రూమి పాత్రల మధ్య ఫైట్ కూడా వాహ్ అనిపిస్తుందని క్రిటిక్స్ చెబుతున్నారు. బాక్సాఫీసు వద్ద సునామీ పక్కా అంటున్నారు. కలెక్షన్లలో కేజీఎఫ్ 2ని దాటిపోతుందని చెబుతున్నారు. అయితే సినిమాని చాలా వరకు క్రిటిక్స్ చేత ప్రమోట్ చేయిస్తున్నారని, అదంతా పెయిడ్ ప్రమోషన్ అంటున్నారు. కొంత మంది క్రిటిక్స్ తో ఇలా పెయిడ్ పోస్ట్ లు చేయిస్తున్నారనే వాదన ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కేఆర్‌కే పోస్ట్ లు పెడుతున్నాడు. పెయిడ్ క్రిటిక్స్ 4 రేటింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆయన్ని ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు.
కానీ ఆయనే కాదు, ఉమైర్ సందు కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. టాక్సిక్.. యష్ కెరీర్‌లో సాహో లాంటి మూవీ అన్నాడు. యష్, తారా సుతారియ జంట బాగుంటుందని, యష్ డైలాగ్ డెలివరీ అంతగా బాగా లేదని, ఇదొక బీ గ్రేడ్, సెమి పో ర్న్ మూవీ అని, స్టంట్స్ బాగా లేవని పోస్ట్ పెట్టాడు. కియారా లుక్ బాగుందని, నటన అంతగా లేదని, ఆమె ఒక క్రింజ్ అంటూ కామెంట్ చేశాడు. ఇది `యానిమల్` మూవీకి కాపీలాంటి చిత్రమన్నాడు. యష్.. సినిమాకి కథ, డైలాగ్స్, దర్శకత్వం, నిర్మాణం చేశాడని, ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం సినిమాకి పెద్ద దెబ్బ అంటున్నాడు. ఇది సినిమా డిజాస్టర్‌కి కారణమవుతుందని, మొత్తంగా టాక్సిక్ పెద్ద డిజాస్టర్ అని, వరస్ట్ మూవీ అంటూ పోస్ట్ పెట్టాడు. ఆయన దీనికి కేవలం 2 రేటింగ్ ఇవ్వడం షాకిస్తోంది. ఇలా టాక్సిక్ మూవీకి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఆర్‌కేనే కాదు, ఉమైర్ సందుని కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అసలు సినిమా ఎలా ఉందనేది ఏసియా నెట్ ఒరిజినల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి.