Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి

Published : Aug 25, 2026, 08:17 AM IST

దొంగ అనే టైటిల్ ఉన్న సినిమాలతో చిరంజీవి, సుమన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇద్దరి చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ చిరంజీవి పైచేయి సాధించారు.

PREV
15
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ తర్వాత తిరుగులేకుండా పోయింది. ఖైదీ తర్వాత రాఘవేంద్ర రావు లాంటి అగ్ర దర్శకులు చిరంజీవితో సినిమా చేయడానికి ఆసక్తి చూపారు. 1985లో వీరి కాంబోలో అడవి దొంగ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా విషయంలో ఆసక్తికర సంఘటన ఉంది. చిరంజీవికి దొంగ అనే టైటిల్ బాగా కలసి వచ్చింది. దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

25
సుమన్, చిరంజీవి సినిమాల పోటీ

చిరంజీవి అడవి దొంగ చేస్తున్న టైంలోనే హీరో సుమన్ దొంగల్లో దొర అనే చిత్రంలో నటించారు. ఇది కూడా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం. చిరంజీవి అడివి దొంగ చిత్రానికి కె రాఘవేంద్ర రావు దర్శకుడు కాగా.. సుమన్ సినిమాకి విజయ బాపినీడు దర్శకుడు. ఆ తర్వాత కాలంలో చిరంజీవితో విజయ బాపినీడు గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సుమన్ దొంగల్లో దొర చిత్రానికి లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించడం విశేషం. ఆయన సంగీతం అందించిన కొద్దిపాటి సినిమాల్లో ఇది కూడా ఒకటి.

35
అడివి దొంగ చిత్రానికి సూపర్ హిట్ టాక్

ఈ చిత్రంలో హీరోయిన్ గా విజయశాంతి నటించింది. కైకాల సత్యనారాయణ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి అడివి దొంగ సినిమాలో రాధ హీరోయిన్ గా నటించింది. ముందుగా సుమన్ దొంగల్లో దొర చిత్రం రిలీజ్ అయింది. దీనికి రెండు వారాల గ్యాప్ లో చిరంజీవి అడివి దొంగ సినిమా రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

45
సుమన్ సినిమాకి దెబ్బ కొట్టిన చిరు

అప్పటి వరకు యావరేజ్ టాక్ తో నడుస్తున్న సుమన్ సినిమాకు చిరంజీవి అడివి దొంగ వల్ల పెద్ద దెబ్బ తగిలింది. సుమన్ సినిమాకి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. అప్పటికీ సుమన్, చిరంజీవి మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది.

55
వరుస హిట్లతో నంబర్ 1 గా మెగాస్టార్

ఖైదీ తర్వాత చిరంజీవి నెక్స్ట్ లెవల్ క్రేజ్ సొంతం చేసుకోవడం, నటించిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ కావడంతో చిరు టాలీవుడ్ లో నంబర్ 1 గా ఎదిగారు. ఇంతలో సుమన్ పర్సనల్ లైఫ్ లో వచ్చిన కుదుపు వల్ల పూర్తిగా వెనుకబడిపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories