ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండు చిన్న సినిమాలు ఈ ఏడాది భారీ విజయాలు సాధించడంతో పాటు అతనికి మంచి పేరు కూతీ తీసుకువచ్చాయి. కీర్తి దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన సినిమా డ్యూడ్. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 114.3 కోట్లు వసూలు చేసింది.
ఇక అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా డ్రాగన్. 36 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 151.83 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు చిన్న సినిమాల భారీ విజయాలతో ప్రదీప్ కు సౌత్ లో హీరోగా స్టార్ డమ్ వచ్చింది.