Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌

Published : Dec 06, 2025, 12:38 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 13 వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రారంభం నుంచి స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్‌ అయ్యాడట. అదే సమయంలో మరో క్రేజీ కంటెస్టెంట్‌ పేరు వినిపిస్తోంది. 

PREV
14
13వ వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 13వ వారం ఎవరు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. టికెట్‌ టూ ఫినాలేలో కళ్యాణ్‌ పడాల విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ తొలి ఫైనలిస్ట్ గా కళ్యాణ్‌ నిలిచారు. దీంతో ఆయన కప్‌ కొట్టేందుకు దగ్గరలోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. 13వ వారం చివరికి చేరుకుంది. శనివారం నుంచి ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ని షూట్‌ చేస్తారు. దీంతో ఎలిమినేషన్‌పై క్లారిటీ వస్తోంది. ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకోబోతుందట. 

24
నామినేషన్‌లో 6 కంటెస్టెంట్లు

13వ వారం నామినేషన్‌లో తనూజ, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, భరణి, సుమన్‌ శెట్టి, సంజనా ఉన్నారు. వీరిలో తనూజ ఓటింట్‌లో టాప్‌లో ఉన్నారు. అనధికారికంగా పలువురు బిగ్‌ బాస్‌ ప్రియులు నిర్వహించిన ఓటింగ్‌లో తనూజతోపాటు రీతూ, భరణి, డీమాన్‌ పవన్‌ టాప్‌లో ఉన్నారు. సంజనా, సుమన్‌ శెట్టి బాటమ్‌లో ఉన్నారు. కానీ బిగ్‌ బాస్‌ అధికారిక ఓటింగ్‌ మాత్రం భిన్నంగా ఉంది. తనూజతోపాటు డీమాన్‌ పవన్‌, సంజనా టాప్‌లో ఉన్నారని,  సుమన్‌ శెట్టి, రీతూ, భరణి డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.  కానీ అనధికారకంగా మాత్రం  తనూజ, రీతూ, పవన్‌ సేఫ్‌లో ఉన్నారని, సుమన్‌ శెట్టి, సంజనా, భరణి బాటమ్‌లో ఉన్నారని ప్రకటిస్తున్నారు.  

34
సుమన్‌ శెట్టి ఎలిమినేషన్‌?

ఇలాంటి కన్‌ఫ్యూజన్‌ నేపథ్యంలో అంతిమంగా తెలుస్తున్నదేంటంటే సుమన్‌ శెట్టి లీస్ట్ లో ఉన్నారు. ఆ తర్వాత సంజన, భరణిలున్నారు. ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్‌ ఉంటుంది. అయితే లేటెస్ట్ ఎలిమినేషన్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఈ వారం సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌ అయ్యాడని తెలుస్తోంది. పలువురు బిగ్‌ బాస్‌ ఫాలోవర్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు 9 షూటింగ్‌ జరుగుతుందని, ఇందులో సుమన్‌ శెట్టి ఎలిమినేషన్‌ కన్ఫమ్‌ అయినట్టు సమాచారం.

44
డబుల్‌ ఎలిమినేషన్‌ వీరేనా?

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ కి ఛాన్స్ ఉందని, సుమన్‌ శెట్టి తర్వాత భరణి, సంజనా డేంజర్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. చాలా వరకు సంజనాని ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. ఒక వేళ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటే ఆమెకి ఛాన్స్ ఉందని, లేదంటే సుమన్‌ శెట్టితోనే సరిపెడతారని టాక్‌. కానీ ఊహించని విధంగా రీతూ చౌదరీ పేరు తెరపై రావడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ డబుల్‌ ఎలిమినేషన్‌కి సంబంధించి అప్‌ డేట్‌ మరికాసేపట్లో రానుంది. ఇప్పటికైతే సుమన్‌ ఎలిమినేషన్‌ పక్కా అని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories