Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్

Published : Dec 06, 2025, 01:11 PM IST

Mahesh Babu పిల్లల వల్ల ఓ డైరెక్టర్ కు సినిమా ఛాన్స్ వచ్చిందంటే నమ్ముతారా? సూపర్ స్టార్ తన పిల్లలతో సహా ఫుల్ గా ఎంజాయ్ చేసిన సినిమా ఏది? వెంకటేష్ నటించిన ఆసినిమా దర్శకుడు ఎవరు? మహేష్ బాబుతో ఆ డైరెక్టర్ తీసిని సినిమా ఏది?

PREV
15
మహేష్ బాబుతో సినిమా అంటే అంత ఈజీ కాదు...

మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉన్నా.. ఆతరువా కాలంలో సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేశాడు. ఏమాత్రం తొందపడకుండా మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేశాడు. వరుస ఫెయిల్యూర్స్ వల్ల మహేష్.. తన సినిమా కెరీర్ లో ఎన్నో మార్పులు చేసుకున్నరు. ఇక ఈ విషయంలో ఆయన భార్య నమ్రత పాత్ర కూడా చాలా పెద్దదని చెప్పాలి. సూపర్ స్టార్ ను కథలతో ఇంప్రెస్ చేసి సినిమాలు సాధించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కానీ మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని తన సినిమాలతో నవ్వించి ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

25
వెంకటేష్ సినిమా చూసి కిందపడి నవ్విన మహేష్ పిల్లలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే సినిమాలు చూస్తుంటారు. వారి కోసం ఇంట్లో స్పెషల్ గా హోమ్ థియేటర్ కూడా ఉంది. ఓ సందర్భంలో వారు వెంకటేష్ నటించిన ఎఫ్2 సినిమా చూశారట. ఆసినిమా చూసినన సితార, గౌతమ్ చైర్లో కూర్చోలేకపోయారట. కిందపడి ఒకటే నవ్వు నవ్వారట. ఈ విషయాన్ని సరిలేరు నీకెవ్వరు సినిమా ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పెషల్ గా వెల్లడించారు. ఈసినిమా చూసిన టైమ్ లోనే అనిల్ రావిపూడి తనకు ఓ కథను నేరేట్ చేయడం.. అది తనకు నచ్చడం.. వెంటనే నమ్రత అనిల్ రావిపూడికి ఫోన్ చేసి ఓకే చేయడం జరిగిపోయాయని మహేష్ వెల్లడించారు.

35
మహేష్ బాబు మాట్లాడుతూ..

" ఎఫ్ 2 సినిమా చూసి మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇంత వరకూ వాళ్లు అంతలా నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. కుర్చీల్లోంచి కిందపడి మరీ నవ్వుకున్నారు. అంతలా ఎఫ్ 2 సినిమాను మేం ఎంజాయ్ చేశాం. ఇక అంతకు ముందే అనిల్ నాకు ఒక కథ చెప్పారు. ఇక ఈ సినిమా చూసిన పది రోజుల్లోనే నేను నమ్రత నిర్ణయం తీసుకున్నాము అనిల్ తో సినిమా చేయాలని. అనిల్ కు వెంటనే ఫోన్ చేసిన నమ్రత చెప్పింది. కొంచెం ముందే రావాల్సింది కదా అని అన్నది. వెంటనే డైరెక్టర నాకు ఓ మెసేజ్ పెట్టాడు.. సర్ ఎలా స్పందించాలో తెలియడంలేదు... థ్యాంక్యూ వెరీమచ్.'' అని మహేష్ బాబు వెల్లడించారు.

45
రాజమౌళి తరువాత అనిల్ రావిపూడి రికార్డు..

టాలీవుడ్ లో అనిల్ రావిపూడికి ఓ రికార్డు ఉంది. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. రాజమౌళి మాదిరిగానే అనిల్ కూడా ఇంత వరకూ ఫెయిల్యూర్ అంటూ చూడలేదు. రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్ .. ఎన్నో హిట్ సినిమాలకు డైలాగ్స్ కూడా రాశారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్. ఆతరువాత చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ.. ఎఫ్ 2 తో స్టార్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా అనిల్ చేరిపోయారు. అప్పటి నుంచి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ తోనే మూడు హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఈ స్టార్ డైరెక్టర్.

55
చిరంజీవితో అనిల్ సినిమా

ఈ ఏడాది సంక్రాంతికి.. వెంకటేష్ తోనే భారీ హిట్ ను అందించిన అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాదుగారు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా..వెంకటేష్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు. తాజాగా వెంటకేష్ సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ఓ సాంగ్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక త్వరలో అనిల్ రావిపూడి పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories