OTT Web Series: ఓటీటీలో టాప్ 5 బోల్డ్ వెబ్ సిరీస్ లు.. ఒంటరిగా మాత్రమే చూడాలి

Published : Aug 01, 2025, 09:49 AM IST

ఓటీటీలో ఒంటరిగా మాత్రమే చూడాల్సిన రొమాంటిక్ వెబ్ సిరీస్ లు కొన్ని ఉన్నాయి. తమన్నా, సుర్వీన్ చావ్లా, సైఫ్ అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి లాంటి నటీనటులు నటించిన ఆ వెబ్ సిరీస్ ల వివరాలు ఇక్కడ చూడండి. 

PREV
16
టాప్ 5 బోల్డ్ వెబ్ సిరీస్ లు

ప్రేక్షకులని ఆకర్షించే కంటెంట్ ని ఓటీటీ సంస్థలు తీసుకువస్తున్నాయి. ఆడియన్స్ లో విభిన్నమైన అభిరుచి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వివిధ జోనర్ చిత్రాలని, వెబ్ సిరీస్ లని ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లకు ధీటుగా ఇండియన్ వెబ్ సిరీస్ లు ఉంటున్నాయి. కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కంటెంట్ ఇష్టం ఉంటుంది. రొమాన్స్ తో నిండిన కంటెంట్ కోరుకునే ప్రేక్షకుల కోసం ఓటీటీలో ఉన్న బోల్డ్ వెబ్ సిరీస్ ల జాబితా అందిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్ లని ఒంటరిగా మాత్రమే చూడాలి. 

DID YOU KNOW ?
నో కిస్సింగ్ రూల్ బ్రేక్ చేసిన తమన్నా
తమన్నా గతంలో ఇంటిమేట్, కిస్సింగ్ సన్నివేశాల్లో నటించకూడదని రూల్ పెట్టుకుంది. కానీ లస్ట్ స్టోరీస్, జీ కర్దా వెబ్ సిరీస్ ల కోసం తన రూల్ ని తానే బ్రేక్ చేసింది. 
26
లస్ట్ స్టోరీస్ 2

2023లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో తమన్నా, మృణాల్ ఠాకూర్, అనుష్క కౌశిక్, విజయ్ వర్మ బోల్డ్ గా నటించారు. ఈ సిరీస్ లో తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్ గురించి ఒక రేంజ్ లో చర్చ జరిగింది.

36
మీర్జాపూర్

ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ లో రొమాన్స్ కంటే ఎక్కువగా హింస, అసభ్యకర పదజాలం ఉంటుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

46
సేక్రేడ్ గేమ్స్

సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, ఎన్నాజ్ నొరౌజి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ రెండు సీజనలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. 

56
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్

ఈ వెబ్ సిరీస్ లో కీర్తి కూల్హారి, మిలింద్ సోనమ్, లిసా రాయ్, సయాని గుప్తా ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కూడా 18 ఏళ్ళు నిండిన వారికోసం మాత్రమే. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

66
జీ కర్దా

తమన్నా నటించిన మరో బోల్డ్ వెబ్ సిరీస్ జీ కర్దా. ఈ సిరీస్ లో సుహైల్ నయ్యర్, కీరా నారాయణ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories