బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరికొన్ని వారాల్లో ప్రారంభం కాబోతోంది. కింగ్ నాగార్జున ఈసారి కూడా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కొన్ని లీక్ అయ్యాయి. అందులో నటి కల్పిక గణేష్ పేరు కూడా ఉంది. జులాయి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద లాంటి చిత్రాలతో కల్పిక గణేష్ గుర్తింపు పొందింది.
DID YOU KNOW ?
మంచు మనోజ్ మూవీతో కల్పిక ఎంట్రీ
2009లో మంచు మనోజ్ ప్రయాణం చిత్రంతో కల్పిక నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలు ఆమెకి గుర్తింపు తీసుకువచ్చాయి.
25
తరచుగా వివాదాల్లో కల్పిక
అయితే కొంత కాలంగా కల్పిక గణేష్ తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. ప్రిజమ్ పబ్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పబ్ సిబ్బందిపై అసభ్యకర పదజాలంతో కల్పిక విరుచుకుపడింది. దీనితో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ రిసార్ట్ లో కూడా కల్పిక గణేష్ అక్కడ సిబ్బందితో గొడవపడింది. నానా హంగామా చేయడంతో ఈమెకి ఏమైంది అని అంతా ఆశ్చర్యపోయారు. సిగరెట్ల కోసం కల్పిక చేసిన హంగామా చూసి నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
35
కల్పికకి మెంటల్ డిజార్డర్ ఉంది
తాజాగా కల్పిక గణేష్ వ్యవహార శైలిపై ఆమె తండ్రి సంఘవార్ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్పికపై ఆమె తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఊహించని పరిణామం. తన కుమార్తె కొంతకాలంగా డిప్రెషన్, మెంటల్ డిజార్డర్ తో బాధపడుతోందని పేర్కొన్నారు. ఆమెపై సంఘవార్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కుమార్తె వల్ల కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని తెలిపారు.
రెండేళ్లుగా కల్పిక డిప్రెషన్ కి సంబంధించిన మెడిసిన్ ఆపేసింది. దీనితో తరచుగా కుటుంబ సభ్యులతో, బయట వ్యక్తులతో గొడవలకు దిగుతోంది. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించాం. అక్కడ కూడా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె బయట ఉంటే చాలా ప్రమాదం. ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించింది. తన కుమార్తెని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంఘవార్ పేర్కొన్నారు.
55
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ సాధ్యమేనా
మరికొన్ని రోజుల్లో కల్పిక గణేష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి చేసిన ఫిర్యాదు ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది ? తండ్రి చేసిన వ్యాఖ్యలతో కల్పిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం సాధ్యమేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే కల్పిక బిగ్ బాస్ హౌస్ ఎంట్రీపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.