1000 కోట్లు వసూలు చేసిన 9 మంది హీరోయిన్లు, 20 ఏళ్లకే రికార్డు కొట్టిన బ్యూటీ, టాలీవుడ్ నుంచి ఎంతమంది?

Published : Dec 26, 2025, 06:19 PM IST

ధురంధర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా 21 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా, వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. 

PREV
16
1000 కోట్ల హీరోయిన్లు...

బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు, 1000 కోట్ల సినిమాలు చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రష్మిక, దీపికా, నయన్,తమన్నా. ఇలా… వెయ్యికోట్ల క్లబ్ లో ఉన్న హీరోయిన్లు ఎవరో తెలుసా? 

26
రష్మిక మందన్న ‌- శ్రీనిధి శెట్టి

ముందుగా సౌత్ నుంచి చూసుకుంటే.. రష్మిక మందన్న, శ్రీనిధి శెట్టి ఇద్దరూ 1000 కోట్ల సినిమాలు ఇచ్చారు. రష్మిక సినిమా 'పుష్ప 2' 1800 కోట్ల భారీ వసూళ్లతో చరిత్ర సృష్టిస్తే..  శ్రీనిధి సినిమా 'కేజీఎఫ్ 2' 1250 కోట్లు వసూలు చేసింది.

36
నయనతార - దీపికా పదుకొణె

నయనతార 'జవాన్' సినిమాతో 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. దీపికా పదుకొణె ఖాతాలో పఠాన్, జవాన్, కల్కి 2098 ఏడీ లాంటి 3 వెయ్యి కోట్ల సినిమాలున్నాయి. ఇక దీపిక మరికొన్ని వెయ్యికోట్ల క్లబ్ లో చేరాల్సిన సినిమాలను మిస్ అయ్యిందని చెప్పవచ్చు. 

46
అనుష్క శెట్టి - తమన్నా భాటియా

అనుష్క శెట్టి, తమన్నా భాటియా ఇద్దరూ ఇద్దరు ఒక్క సినిమాతోనే 1000 కోట్ల క్లబ్ లో చేరారు.  వీరిద్దరు హీరోయిన్లు గా నటించిన 'బాహుబలి 2' 1810.60 కోట్ల కలెక్షన్ సాధించింది. ఒక రకంగా ఇండియాలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్లు  ఈ ఇద్దరనే చెప్పాలి. 

56
రమ్యకృష్ణ - ఫాతిమా సనా షేక్

రమ్యకృష్ణ సినిమా 'బాహుబలి 2' 1810.60 కోట్ల వ్యాపారం చేసింది. మరోవైపు, ఫాతిమా సనా షేక్ సినిమా 'దంగల్' 2160 కోట్లు సంపాదించింది.

66
సారా అర్జున్

సారా అర్జున్ లేటెస్ట్ రిలీజ్ 'ధురంధర్' ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 1000 కోట్ల సినిమా చేసిన అతి పిన్న వయస్కురాలైన హీరోయిన్ సారా. 20 ఏళ్ల సారా సినిమా 'ధురంధర్' 1007.21 కోట్లు సంపాదించింది.

Read more Photos on
click me!

Recommended Stories