Savitri: మహానటి సావిత్రి విలన్‌ రోల్‌ చేసిన తొలి చిత్రం ఏంటో తెలుసా? ఏకంగా ఎన్టీఆర్‌నే లేపుకుపోయింది

Published : Dec 26, 2025, 05:00 PM IST

మహానటి సావిత్రి అనేక విలక్షణ పాత్రలు పోషించి మెప్పించింది. అదరగొట్టింది. అయితే ఆమె కెరీర్‌లో తొలిసారి నెగటివ్‌ రోల్‌ చేసిన మూవీ ఏంటో తెలుసా? ఆడియెన్స్ నే ఆశ్చర్యానికి గురిచేసింది సావిత్రి. 

PREV
15
మహానటి సావిత్రి 44వ జయంతి

మహానటి సావిత్రి మన నుంచి దూరమై 44ఏళ్లు అవుతుంది. అయినా ఆమె మన మధ్యనే ఉన్నట్టుగా ఉంది. సావిత్రి నటించిన సినిమాలు ఆమెని ఇంకా సజీవంగానే ఉంచుతున్నాయి. తెలుగు తెరపైనేకాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటిగా ఓ వెలుగు వెలిగారు. సావిత్రి మరణం చాలా విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. సంసార జీవితం విఫలం కావడం, దర్శకురాలిగా సక్సెస్‌ కాలేకపోవడం, నిర్మాతగా నష్టాలను చవిచూడటం, నమ్మినవాళ్లు మోసం చేయడం, ఐటీ దాడులు ఇలా అన్ని కష్టాలు ఆమెని చుట్టుముట్టాయి. దీంతో మ ద్యానికి బానిసై, డిప్రెషన్‌లోకి వెళ్లి కొన్నాళ్లపాటు కోమాలో ఉండి చనిపోయింది. సావిత్రి చనిపోయి నేటికి(డిసెంబర్‌ 26కి) 44 ఏళ్లు కావడం గమనార్హం.

25
విలన్‌ రోల్‌ చేసిన సావిత్రి

మహానటి సావిత్రి తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు పోషించింది. స్పెషల్‌ సాంగ్స్ కూడా చేసింది. హీరోయిన్‌గా చేసింది. సెకండ్‌ లీడ్‌గా చేసింది, కీలక పాత్రలు పోషించింది. చివరి దశలో తల్లి పాత్రలు కూడా పోషించింది. అయితే ప్రేమకి ప్రతిరూపం, దానధర్మాలకు ప్రతిబింబింగా నిలిచే సావిత్రి తన కెరీర్‌లో హీరో పాత్రలే కాదు, విలన్‌ రోల్ కూడా చేసింది. మహానటి సావిత్రి చేసిన తొలి విలన్‌ రోల్‌ ఏంటనేది తెలుసుకుందాం.

35
`సంసారం` మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సావిత్రి

సావిత్రి `సంసారం` సినిమాతో నటిగా మారాల్సింది. కానీ చిన్నగా ఉండటం, మెచ్యూరిటీ లేకపోవడంతో ఆమెని తీసేశారు. కాకపోతే ఇందులో హీరోయిన్‌కి ఫ్రెండ్స్ లో ఒకరిగా కాసేపు మెరిసింది. `పాతాళభైరవి` చిత్రంతో నటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఇందులో ఒక మాయామహల్‌లో డాన్స్ చేసే పాత్రలో కనిపించింది. చిన్నపాటి డాన్స్ సన్నివేశంలో సావిత్రి మెరిసింది. `రమ్మంటే రానే రాను...నేను రమ్మంటే రానేరాను` అనే పాటకు తనదైన అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకుంది. ఇందులో కాస్త స్పెషల్‌ సాంగ్‌ని తలపించేలా ఉంటుందని చెప్పొచ్చు.

45
సావిత్రి నెగటివ్‌ రోల్‌ చేసిన మూవీ ఇదే

సావిత్రి 1952లో వచ్చిన `పెళ్లి చేసి చూడు` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత వరుసగా ఫీమేల్ లీడ్‌గా చేసి మెప్పించింది. ఇక వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదు. `దేవదాసు` ఆమె లైఫ్‌ని మార్చేసిందని చెప్పొచ్చు. స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తోపాటు అప్పటి టాప్‌ హీరోలందరికి సావిత్రినే ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఈ క్రమంలో సావిత్రి `చంద్రహారం` అనే మూవీలో నటించింది. ఇది 1954లో విడుదలైంది.  మంత్రాలు, తంత్రాల(జానపద) నేపథ్యంలో సాగే ఈ మూవీలో సావిత్రి చంచలగా నటించింది. ఇందులో ఎన్టీఆర్‌ హీరోగా నటించగా, శ్రీరంజని హీరోయిన్‌గా చేసింది.

55
ఎన్టీఆర్‌ని లేపుకుపోయే పాత్రలో సావిత్రి

కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ విజయా సంస్థ నిర్మించిన చిత్రమిది. అందులో హీరోపై మనసు పడి, అతనిని తన సొంతం చేసుకోవాలని, హీరోయిన్‌ పలుకష్టాలకు గురిచేసే చంచలగా సావిత్రి నటించారు. హీరోను వరించి తీసుకొని వెళ్ళే వ్యాంప్‌ లక్షణాలున్న దేవకన్య వేషం వేసింది మహానటి. ఆమె కెరీర్ లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రమిదే కావడం విశేషం.  నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్ లో సావిత్రి ఇరగదీసింది. అంతేకాదు ఇందులో ఆమె పాత్రలో కొంత వ్యాంప్‌ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలా తనలోని విలక్షణ నటిని బయటపెట్టింది సావిత్రి. సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా, ఈ మూవీకి మాత్రం ఆమె కెరీర్‌లో స్పెషల్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories