OTT Top 5 Movies and Series: ఓటీటీలో దుమ్మురేపుతున్న కూలీ.. టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే

Published : Sep 23, 2025, 09:43 PM IST

OTT Top 5 Movies and Series: గత సెప్టెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. `కూలీ` మూవీ ఓటీటీలో దుమ్ములేపుతుంది. 

PREV
14
ఓటీటీలో టాప్‌ 5 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

థియేటర్ల లాగే ఓటీటీలోనూ ప్రతి వారం కొత్త సినిమాలు పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 15-21 మధ్య ఓటీటీలో అత్యధిక వ్యూస్ పొందిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను చూద్దాం.

24
రెండో స్థానంలో ఉన్న రజనీకాంత్‌ `కూలీ`

ఓటీటీలో ఈ వారం అత్యధిక వ్యూస్ పొందిన సినిమాల్లో బాలీవుడ్‌ మూవీ 'సైయారా' మొదటి స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 60 లక్షల వ్యూస్ వచ్చాయి. నెట్‌ ఫ్లిక్స్ లోనే ఉన్న రజనీకాంత్ 'కూలీ' రెండో స్థానంలో ఉంది. దీనికి 49 లక్షల వ్యూస్‌ వచ్చాయి. 

34
మూడో స్థానంలో `మహావతార్‌ నరసింహ`

ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన  'మహావతార్ నరసింహ' మూవీ ఓటీటీలోనూ రచ్చ చేస్తోంది. ఇది 33 లక్షల వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది.  ఇది కూడా నెట్‌ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్‌ అవుతుంది. 'ఇన్‌స్పెక్టర్ జిండే' 21 లక్షల వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉంది.  'సిన్నర్స్' అనే హారర్ సినిమా 12 లక్షల వ్యూస్‌తో ఐదో స్థానంలో నిలిచింది.

44
టాప్‌ 5 వెబ్‌ సిరీస్‌లు

వెబ్ సిరీస్‌లలో, ఆర్యన్ ఖాన్ 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' (నెట్‌ ఫ్లిక్స్) 46 లక్షల వ్యూస్‌తో టాప్‌లో ఉంది. ఇది బాలీవుడ్‌ సినిమా స్టార్స్ తెరవెనుక విషయాలను ఆవిష్కరించే సిరీస్‌ కావడం విశేషం. ఇది రిలీజ్‌కి ముందే దుమ్మురేపింది. తమన్నా సాంగ్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  'ది ట్రయల్' (25 లక్షలు)(జియో హాట్‌ స్టార్‌) రెండో స్థానంలో ఉండగా, , 'డూ యు వానా పార్టనర్' (20 లక్షలు)(అమెజాన్‌) మూడో స్థానంలో నిలిచింది. `వెడ్‌నస్‌ డే`(15 లక్షలు(నెట్‌ ఫ్లిక్స్)తో నాల్గో స్థానంలో ఉండగా, `హాఫ్‌ సీఏ` సీజన్‌ 2.. 12 లక్షలతో ఐదో స్థానంలో ఉంది. ఇది అమెజాన్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories