కాన్ఫిడెన్స్ కోల్పోయాను.. ప్రభాస్ మూవీ ఫెయిల్యూర్‌పై ఓం రౌత్ ఎమోషనల్

Published : Sep 23, 2025, 08:09 PM IST

Om Raut - Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ బాక్సాఫీస్‌లో విఫలమైంది. ట్రోలింగ్, విమర్శల వల్ల ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ జెండెతో రీ-ఎంట్రీ చేస్తున్నారు.

PREV
15
ఆదిపురుష్ ఫెయిల్యూర్‌పై ఓం రౌత్ ఎమోషనల్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్ (Adipurush).ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. రామాయణాన్ని తెరపై చూపించిన తీరు, దారుణమైన గ్రాఫిక్స్, అనవసరంగా చొప్పించిన ఆధునికత, అలాగే సినిమా స్క్రీన్‌ప్లే అన్నీ కలిపి ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిపాయి. మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చినా, వారం రోజుల్లోనే కలెక్షన్లు కుదించుకుపోవడం, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం సినిమా మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది.

25
దర్శకుడుపై ట్రోలింగ్‌

ఆదిపురుష్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సంభాషణలు, పాత్రల ప్రెజెంటేషన్, గ్రాఫిక్స్ అన్నీ కలిపి దర్శకుడు ఓం రౌత్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంతమంది ఆయన ప్రాణ భద్రతకే ముప్పు కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా రౌత్ కొంతకాలం ప్రజలకు దూరంగా ఉండి, మీడియాలో కూడా కనిపించకుండా మాయమయ్యారు. ఈ విపరీతమైన ప్రతికూల స్పందన ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసింది.

35
వైఫల్యం నాకు పెద్ద పాఠం నేర్పింది- ఓం రౌత్

ఇటీవల డైరెక్టర్ ఓం రౌత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆదిపురుష్’విడుదల సమయంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “తప్పులు జరగడం సహజం. విజయం మనకు పాఠాలు నేర్పుతుందని అనిపించినా, వైఫల్యం మాత్రం మరింత బోధన ఇస్తుంది. ఆదిపురుష్ లో వచ్చిన విపరీతమైన విమర్శలు, ట్రోలింగ్ వల్ల నేను పూర్తిగా బ్రేక్ అయ్యాను. ఒకే సినిమా వల్ల నా కాన్ఫిడెన్స్ పూర్తిగా కోల్పోయాను. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహిత టీమ్ సభ్యుల సపోర్ట్ వల్లనే మళ్లీ నిలబడగలిగాను. ఇక ఇప్పుడు ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి రెట్టింపు కష్టపడాలి. త్వరలోనే మంచి కంటెంట్‌తో కూడిన సినిమాతో మీ ముందుకు రావాలని నా మనసు కోరుకుంటోంది”అని ఆయన తెలిపారు.

45
నిర్మాతగా రీ-ఎంట్రీ

ఆదిపురుష్ ఫెయిల్యూర్ తర్వాత కొంత విరామం తీసుకున్న ఓం రౌత్ ఇప్పుడు నిర్మాతగా ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన నెట్‌ఫ్లిక్స్ మూవీ ఇన్‌స్పెక్టర్ జెండె (Inspector Jende)ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ విజయం ఆయనకు కొత్త ఊపిరి పోసిందని, ఇక నుంచి కంటెంట్‌ బలమైన సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

55
డైరెక్టర్ కు గుణపాఠం

ఓం రౌత్ కెరీర్‌లో ఆదిపురుష్ ఒక చేదు అనుభవంగా మిగిలినా, అదే ఆయనకు ఒక పెద్ద పాఠంగా మారింది. ట్రోలింగ్‌ వల్ల ఎదుర్కొన్న మానసిక కష్టాలను అధిగమించి, ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల విశ్వాసాన్ని సంపాదించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, త్వరలోనే ఆయన మరొక సినిమా ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశముందని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories