ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు లేని కాలంలో ఓ చిన్న పిల్లాడి ఊహలు, అల్లరి, సాహసాలు, బాల్యాన్ని ఈ సిరీస్ అందంగా చూపిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఓ చిన్న పట్టణం నేపథ్యంలో, కుటుంబానికి గౌరవం తీసుకురావాలనుకునే ఓ బాలుడి కోణంలో కథ సాగుతుంది.
ఈ కథ పిల్లల ప్రపంచం చుట్టూ తిరిగినా, పెద్దలు చూస్తే తమ సొంత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా ఎన్నో సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూస్తే, తమ బాల్యం ఎలా ఉండేదో మాట్లాడుకునేలా చేసే మంచి నాస్టాల్జియా సిరీస్ ఇది.
ఈ 5 సిరీస్‌లలో స్పెషల్ ఏంటి?
ఈ లిస్ట్‌లోని సిరీస్‌లు ఏవీ కూడా భారీ యాక్షన్, హింస లేదా ఉత్కంఠభరితమైన ట్విస్టులపై ఆధారపడి తీసినవి కావు. కుటుంబం, ప్రేమ, బాల్యం, జీవితంలోని చిన్న చిన్న సంతోషాలనే ఇవి ప్రధానంగా చూపిస్తాయి.
కాబట్టి, ఈ వీకెండ్‌లో ఒంటరిగా ఓటీటీలో ఏదో ఒకటి చూసే బదులు, కుటుంబంతో కలిసి ఒక మంచి సిరీస్ చూడాలనుకుంటే, ఈ 5 సిరీస్‌లను మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.