Shakeela: ఒకప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక ఊపు ఊపిన నటి షకీలా, తాను సంపాదించిన కోట్లాది రూపాయలను తన సొంత అక్కే కాజేసిందని ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు.
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ నటిగా వెలిగిన షకీలా, తాను సంపాదించిన కోట్ల రూపాయల డబ్బును సొంత అక్కే తీసుకుందని ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇప్పుడు తనకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, అందుకే తను తిరిగి రావొద్దని దేవుడిని కోరుకుంటున్నా' అని ఆమె అన్నారు. ఈ మాటలు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.
26
4 కోట్లకు పైగా సంపాదించిన షకీలా..
2000వ సంవత్సరం నుంచి మలయాళ చిత్ర పరిశ్రమలో షకీలా హవా మొదలైంది. కొద్ది రోజుల్లోనే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా షకీలా సినిమాలు జనాలను థియేటర్లకు రప్పించేవి. 2000లో వచ్చిన 'కిన్నెరతుంబికళ్' చిత్రాన్ని కేవలం 12 లక్షల బడ్జెట్‌తో తీస్తే, అది దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ విజయంతో మలయాళంలో 'షకీలా వేవ్' అనే కొత్త ట్రెండ్ మొదలైంది. తన పాపులారిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు దాదాపు 4 కోట్లు సంపాదించానని షకీలా చెప్పారు.
36
డబ్బంతా ఎక్కడికి పోయింది ..
సంపాదించిన డబ్బంతా ఎక్కడికి పోయింది అని అడిగితే, 'అదంతా మా అక్క దగ్గర సేఫ్‌గా ఉంది, తను హ్యాపీగా సెటిల్ అయింది' అని షకీలా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. 'మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసింది ఎవరు?' అని అడగ్గా, 'మా అక్కే' అని ఆమె స్పష్టంగా చెప్పారు. మొదట్లో తనను చూడటానికి అక్క రావడం లేదని బాధపడ్డానని, కానీ ఇప్పుడు తనకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు కాబట్టి, తను రాకపోవడమే మంచిదనిపిస్తోందని అన్నారు.
కొన్నేళ్ల క్రితం రాసిన తన ఆత్మకథలో, 'నేను నేరస్థురాలిని కాదు, కానీ నాకు బాధ ఉంది' అని షకీలా రాసుకున్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లు తనను ప్రేమించకుండా, కేవలం తన డబ్బును మాత్రమే ప్రేమించడమే ఆ బాధకు కారణమని ఈ ఇంటర్వ్యూలో ఆమె మరోసారి స్పష్టం చేశారు.
56
ఆరోపణలను ఖండించిన షకీలా ..
సినీ పరిశ్రమ తనను వాడుకుందన్న ఆరోపణలను షకీలా ఖండించారు. 'నేను చేసిన పనికి నాకు మంచి జీతం ఇచ్చారు. కాబట్టి వాళ్లు నన్ను వాడుకోలేదు' అని ఆమె అన్నారు. కేరళలోని పెద్ద స్టార్లు తన ఎదుగుదలను అడ్డుకున్నారన్న మాటను కూడా ఆమె నమ్మరు. 'వాళ్ల ముందు నేను ఒక చిన్న గడ్డిపోచ లాంటిదాన్ని. వాళ్లు పెద్ద మనుషులు, పెద్ద మనసున్నవాళ్లు, అలా చేయరు' అని చెప్పారు. తన పాపులారిటీ ఒక వేవ్ లాంటిదని, అది ఏదో ఒక రోజు ముగుస్తుందని తనకు ముందే తెలుసని కూడా ఆమె అన్నారు.
66
ఎలాంటి పశ్చాత్తాపం లేదు..
తాను నటించిన సినిమాల గురించి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని షకీలా చెబుతారు. 'అవి చేశాను కాబట్టే కదా 26 ఏళ్ల తర్వాత కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు?' అని ప్రశ్నిస్తారు. అయినా, జీవితాన్ని మళ్లీ బతికే అవకాశం వస్తే మాత్రం, ఇదే వృత్తిని ఎంచుకోనని అంటారు. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఐపీఎస్ అధికారి కావాలనేది తన కోరిక అని చెప్పారు. స్కూల్ రోజుల్లో టీచర్లు కొట్టడంతో చదువుపై విరక్తి వచ్చిందని, కానీ ఇప్పుడు తన జ్ఞాపకశక్తి బాగుండటంతో ఏదైనా సులభంగా నేర్చుకోగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.