Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?

Published : Aug 27, 2026, 01:06 PM IST

Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని శ్యామ్లీలో హర్యానవీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బాలియాన్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. వరుస రౌండ్ల కాల్పులతో ఈ హత్య సంచలనం సృష్టిస్తోంది.

PREV
15
కోర్ట్ మే గోలీ మారేంగే ఫేమ్ అంకిత్ బాలియాన్ దారుణ హత్య.. యూపీలో అసలు ఏం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని శ్యామ్లీ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. ప్రముఖ హర్యానవీ గాయకుడు, నటుడు, యూట్యూబర్ అంకిత్ బాలియాన్‌ను గుర్తుతెలియని దుండగులు బుధవారం సాయంత్రం జిమ్ బయట దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

25
జిమ్ బయట 18 రౌండ్ల కాల్పులు

ఈ ఘటన శ్యామ్లీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రోజువారీ వర్కవుట్ ముగించుకుని సాయంత్రం 6:30 నుండి 6:45 గంటల ప్రాంతంలో అంకిత్ బాలియాన్ జిమ్ బయటకు రాగానే, ముసుగు ధరించిన నలుగురు దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

జిమ్ యజమాని రవి శర్మ తెలిపిన వివరాల ప్రకారం, అంకిత్ ప్రతిరోజూ జిమ్‌కు వచ్చేవాడు. బుధవారం సాయంత్రం వర్కవుట్ అయ్యాక బయటకు వెళ్తుండగా దుండగులు 15 నుండి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అటాక్ జరిపిన వెంటనే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.

35
సింగర్ అంకిత్ బాలియాన్ బ్యాక్‌గ్రౌండ్

అంకిత్ బాలియాన్ శ్యామ్లీ జిల్లాలోని బాంటిఖేరా గ్రామానికి చెందినవారు. హర్యానాలోని రోహ్‌తక్, సోనిపట్ ప్రాంతాలలో ఉంటూ హర్యానవీ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో తన కంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదు, పాటల రచయిత, నటుడు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కూడా. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ద్వారా హర్యానవీ సంస్కృతిని, స్థానిక పాటలను అభిమానులకు అందిస్తూ మంచి పాపులారిటీ సాధించారు.

45
సూపర్‌హిట్ పాటలు, డిజిటల్ కెరీర్

అంకిత్ బాలియాన్ పాడుతూ నటించిన ‘భారీ కోర్ట్ మే గోలీ మారేంగే’ పాట మంచి విజయాన్ని సాధించింది. ఈ ఒక్క పాటకే యూట్యూబ్‌లో 54 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీనితో పాటు '112 NE', 'అగ్లా జనం జాట్', 'సంవిధాన్', 'జాట్ ధర్మేందర్ కీ తరియా వంటి పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆయన పాటల్లో హర్యానవీ పాప్ సంస్కృతి, గ్రామీణ వాతావరణం, ప్రాంతీయ ఆత్మగౌరవం ఎక్కువగా కనిపించేవి.

55
రాజకీయ కోణంలో విచారణ

అంకిత్ బాలియాన్ సంగీత రంగంలోనే కాకుండా రాబోయే జిల్లా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కోణంలోనే హత్య జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ హత్య ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ లో ఆయన స్పందిస్తూ, "ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. శ్యామ్లీలో ప్రజాదరణ పొందిన గాయకుడు అంకిత్ బాలియాన్‌ను 18 రౌండ్లు కాల్చి చంపడం చాలా దారుణం. ఈ దాడిని జాట్ సమాజం తమపై జరిగిన దాడిగా భావిస్తోంది. ఈ హత్య వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరపాలి" అని డిమాండ్ చేశారు.

శ్యామ్లీ ఎస్పీ ఎన్‌పి సింగ్ మాట్లాడుతూ, డయల్ 112 ద్వారా సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. దుండగులను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories