Highest Paid Influencers : ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో రూ. 22 లక్షలా..! టాప్ 5 ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్లే

Published : Jul 16, 2026, 04:30 PM IST

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఇండియాలోని కొందరు టాప్ ఫ్యాషన్, బ్యూటీ క్రియేటర్లు ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. టాప్ 5 ఇన్ఫ్లుయెన్సర్ల ఫీజుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

PREV
15
5. శ్రేయా జైన్
శ్రేయా జైన్ ఒక బ్రాండ్ కోలాబరేషన్ కోసం దాదాపు రూ. 4 లక్షల వరకు తీసుకుంటుందట. మేకప్ ట్యుటోరియల్స్, స్కిన్‌కేర్ టిప్స్, నిజాయితీగా ఇచ్చే ప్రొడక్ట్ రివ్యూలతో బ్యూటీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ నమ్మకమైన గుర్తింపు తెచ్చుకుంది.
25
4. నగ్మా మిరాజ్కర్
నగ్మా మిరాజ్కర్ ఒక బ్రాండెడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం సుమారు రూ. 7.5 లక్షలు ఛార్జ్ చేస్తుంది. షార్ట్ వీడియోలతో పాపులర్ అయిన నగ్మా.. ఇప్పుడు ఫ్యాషన్, ట్రావెల్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ కంటెంట్‌తో పెద్ద బ్రాండ్లతో పనిచేస్తోంది.
35
3. రిదా థరానా
రిదా థరానా ఒక స్పాన్సర్డ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ. 8 లక్షలు తీసుకుంటుందని సమాచారం. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, రిలేషన్‌షిప్స్, కాన్ఫిడెన్స్‌కు సంబంధించిన ఆమె వీడియోలు ముఖ్యంగా Gen Z ఆడియన్స్‌లో చాలా పాపులర్.
45
2. అంకుశ్ బహుగుణ
అంకుశ్ బహుగుణ ఒక బ్రాండెడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ. 10 లక్షల వరకు తీసుకుంటాడట. కామెడీ కంటెంట్‌తో కెరీర్ మొదలుపెట్టిన అంకుశ్, మేకప్, బ్యూటీ కంటెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పెద్ద బ్రాండ్లకు ఫేవరెట్‌గా మారాడు.
55
1. కోమల్ పాండే
కోమల్ పాండే ఒక ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ కోలాబరేషన్ కోసం ఏకంగా రూ. 22 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్. ఆమె ఫ్యాషన్ ప్రయోగాలు, హై-ఎండ్ స్టైలింగ్, సినిమాటిక్ కంటెంట్.. ఆమెను ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డిజిటల్ ఫ్యాషన్ క్రియేటర్‌గా నిలబెట్టాయి.
Read more Photos on
click me!

Recommended Stories